News September 5, 2025
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: మంత్రి టీజీ భరత్

కర్నూలు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధిపై మెడికల్ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి టీజీ భరత్ వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, హాస్పిటల్ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అంతకు ముందు పుల్లారెడ్డి డెంటల్ కాలేజీ ప్రతినిధులు మంత్రి చేతుల మీదుగా 10 స్ట్రెచర్లను హాస్పిటల్‌కు ఇచ్చారు.
Similar News
News September 5, 2025
రేషన్ షాపుల్లో ఉల్లి కిలో రూ.12: కలెక్టర్

కర్నూలులోని 170 రేషన్ డిపోల్లో ఉల్లి కిలో రూ.12కు విక్రయిస్తున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డును చూపించి కార్డుదారులు కొనుగోలు చేయవచ్చన్నారు. నగరంలోని హోటళ్ల యాజమానులు కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లిని సబ్సిడీ ధరకే కొనుగోలు చేయవచ్చన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News September 4, 2025
మంత్రాలయం ఉపాధ్యాయుడికి అవార్డు

మంత్రాలయం జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు నరసింహ రాజుకు జిల్లా స్థాయి స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. ఈనెల 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఈ పాఠశాల చరిత్రలోనే ఎవరూ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు అందుకోలేదని ఆయన తెలిపారు. తోటి ఉపాధ్యాయులు అభినందించారు.
News September 4, 2025
ఈనెల 8 న జిల్లాస్థాయి హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలు

ఈనెల 8న కర్నూలులోని బి.క్యాంప్ క్రీడా మైదానంలో బాల బాలికలకు హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు హ్యాండ్ బాల్ సంఘం జిల్లా కార్యదర్శి పి.సువర్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2013 నుంచి 2015 మధ్యలో జన్మించిన బాల బాలికలు పోటీలకు అర్హులన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 14న డోన్‌లోని కోట్ల స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు.