News March 5, 2025
రోగులకు మెరుగైన సేవలందించాలి: కలెక్టర్

మణుగూరు: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మణుగూరు ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలో కలియ తిరుగుతూ జనరల్ వార్డు, ఇన్ పేషెంట్ వార్డ్, ల్యాబ్, స్కానింగ్, డయాలసిస్ యూనిట్ లను పరిశీలించి రోగులతో మాట్లాడారు.
Similar News
News November 9, 2025
ములుగు: ముగిసిన సీతాకోక చిలుకల సర్వే

ఏటూరునాగారం అభయారణ్యంలో సీతాకోక చిలుకలు, చిమ్మటల సర్వే ముగిసింది. 8 రాష్ట్రాలకు చెందిన 60 మంది ప్రతినిధులు ఈ సర్వేలో పాల్గొన్నారు. నాలుగు రోజులపాటు అటవీ ప్రాంతంలో సీతాకోకచిలుకల జాడను అన్వేషించారు. ఐసీఏఆర్ ఎంటమాలజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ చిత్రా శంకర్ ఆధ్వర్యంలో సర్వే నివేదికను డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్‌కు అందజేశారు. ములుగులో జరిగిన సర్వే ముగింపు కార్యక్రమంలో వారందరికీ ప్రశంస పత్రాలు అందించారు.
News November 9, 2025
హక్కులతో పాటు బాధ్యతలు తెలుసుకోవాలి: భద్రయ్య

సమాజంలో ప్రతి పౌరుడు తమ హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకోవాలని ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షుడు మొగుళ్ళ భద్రయ్య అన్నారు. ఆదివారం ములుగులో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అవినీతి, అక్రమాలకు తావులేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యలపై తమ సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.
News November 9, 2025
నిద్ర సమయంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

అధిక రక్తపోటు లక్షణాలు ఎక్కువగా రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫ్యాన్/ఎయిర్ కండిషనర్ ఉన్నా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచూ మూత్ర విసర్జన, దీర్ఘకాలిక అలసట, తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, ముక్కు నుంచి రక్తం కారడం, ఛాతి నొప్పి, తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.


