News March 16, 2025

రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: అదనపు కలెక్టర్

image

ఆసుపత్రుల్లో రోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సుధీర్ తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో వేసవి నేపథ్యంలో ఫ్యాన్లు, తాగునీరు, మొదలగు సౌకర్యాలు కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.

Similar News

News March 16, 2025

వరంగల్ అమ్మాయితో అమెరికా అబ్బాయి మ్యారేజ్❤️

image

వరంగల్‌కు చెందిన అమ్మాయితో అమెరికాకు చెందిన అబ్బాయికి ఆదివారం పెళ్లి జరగనుంది. కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్ సంపత్- పద్మ దంపతుల రెండో కూతురు సుప్రియ ఐదేళ్ల క్రితం పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. అదే కాలేజీలో చదువుతున్న గ్రాండ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. దీంతో గ్రాండ్ తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకొనేందుకు సిద్ధమయ్యాడు. వీరి పెళ్లి వరంగల్‌లో నేడు జరగనుంది.

News March 16, 2025

నేడు జనగామ జిల్లాకు CM.. షెడ్యూల్ ఇదే!

image

నేడు జనగామ జిల్లాకు CM రేవంత్ రెడ్డి రానున్న విషయం తెలిసిందే. కాగా, షెడ్యూల్ ఇలా ఉంది.
>మ.1:00 హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు.
>1:5 కాన్వాయ్ ద్వారా శివునిపల్లి సభ ప్రాంగణానికి చేరుకుంటారు.
>1:10 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లు, ఇందిరా బస్సుల ప్రదర్శన.
>1:40 అభివృద్ధి పనుల ఆవిష్కరణ
>1:55 SGH మహిళలకు చెక్కుల పంపిణీ.
>2-2:35 MLA, MP, మంత్రుల ప్రసంగాలు.
>2:40 CM ప్రసంగం.

News March 16, 2025

ఎన్టీఆర్: విద్యార్థులకు గమనిక.. ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలో ఆగస్టు 2024లో నిర్వహించిన 5వ, 6వ సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.

error: Content is protected !!