News October 3, 2024
రోజా గారూ.. అప్పుడు ఏమైంది: వాసంశెట్టి

అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి రోజా ట్వీట్ చేయగా..దీనికి కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కౌంటర్ ఇచ్చారు. ‘రోజా గారూ మీరు మంచి మనసుతో ఇలా స్పందించడం చాలా ఆనందం. కానీ ఆరోజు రాజకీయాలకు సంబంధంలేని లోకేశ్ తల్లి భువనేశ్వరిని నిండు సభలో YCP నేతలు అవమానించినప్పుడు పకపక నవ్వారు కదా అప్పుడు ఏమైంది మీ స్పందన?’అని వాసంశెట్టి ట్వీట్ చేశారు.
Similar News
News December 3, 2025
‘ఆయుష్మాన్ భారత్’ పరిధిని విస్తరించాలి: MP పురందేశ్వరి

ఆయుష్మాన్ భారత్ పరిధిని విస్తరించాలని రాజమండ్రి MP దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. ఈరోజు ఆమె పార్లమెంట్‌లో ముఖ్యమైన అంశం కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీర్ఘకాలిక, సాధారణ వ్యాధుల కోసం అవసరమైన ఓపీడీ సేవలను పథకం పరిధిలో తక్షణమే చేర్చాలని, ఆసుపత్రి అనంతరం ఔషధాల కవరేజిని 15 రోజుల పరిమితిని విస్తరించి లబ్ధిదారులపై పడుతున్న అదనపు ఖర్చులను గణనీయంగా తగ్గించాలని ఆమె కోరారు.
News December 3, 2025
పసలపూడి వాసికి ‘కర్మ వీర్ చక్ర’ అవార్డు

ఉండ్రాజవరం మండలం పసలపూడికి చెందిన యువర్స్ బిసర్వేంట్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు చీపుళ్ళ విజయ్‌కు ‘కర్మ వీర్ చక్ర’ అవార్డు లభించింది. ఐక్యరాజ్యసమితి సహకారంతో వివిధ సేవా కార్యక్రమాల్లో అందించే సేవలకు ప్రతీ సంవత్సరం నవంబర్ నెలలో అవార్డులు అందిస్తారు. విజయ్ తన ఆర్గనైజేషన్ ద్వారా 50వేల మందికిపైగా బ్లడ్, లక్ష మందికి పైగా ఆహారం, వీల్ ఛైర్స్ అందజేత కార్యక్రమాలకు గానూ.. న్యూఢిల్లీలో అవార్డు అందుకున్నారు.
News December 3, 2025
ఈ నెల 5న మెగా పేరెంట్స్ డే: డీఈవో

జిల్లా వ్యాప్తంగా 988 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 5వ తేదీన మెగా పేరెంట్స్ డే నిర్వహిస్తున్నట్లు డీఈఓ వాసుదేవరావు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్య పరిశీలన, బోధన విధానాలు, ప్రోగ్రెస్ కార్డులు, ల్యాబ్‌లు, బోధన సామాగ్రి ప్రదర్శన వంటివి నిర్వహిస్తారు. విద్యార్థుల సామర్థ్యాన్ని తల్లిదండ్రుల సమక్షంలోనే పరిశీలిస్తామని, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారని ఆయన వెల్లడించారు.


