News December 25, 2025
రోజుకు 4 లక్షల లడ్డూలు తయారీ: TTD ఛైర్మన్

వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. లడ్డూ విక్రయశాల, తయారీ విభాగాన్ని పరిశీలించిన ఆయన రోజుకు 4 లక్షల చిన్న లడ్డూలు, 8 వేల కళ్యాణోత్సవం లడ్డూలు విక్రయిస్తున్నట్లు చెప్పారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లడ్డూ విక్రయాలు పెరిగే అవకాశం ఉందని, నాణ్యతతో పాటు క్యూలైన్‌లో వేచిచూడే సమయం తగ్గించే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Similar News
News December 27, 2025
MSMEలకు పెరుగుతున్న రుణ వితరణ

దేశంలోని MSMEలకు బ్యాంకులు, NBFCలు తదితరాల నుంచి రుణ వితరణ పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ సెప్టెంబర్ నాటికి 16% పెరిగి రూ.46లక్షల కోట్లకు చేరింది. యాక్టివ్ లోన్ ఖాతాలూ 11.8% పెరిగి 7.3 కోట్లకు చేరాయి. కేంద్ర రుణ పథకాలతో పాటు విధానపరమైన మద్దతు దీనికి కారణంగా తెలుస్తోంది. గత రెండేళ్లలో MSME రుణ చెల్లింపుల్లో కూడా వృద్ధి కనిపించింది. 91-180 రోజుల ఓవర్ డ్యూ అయిన లోన్‌లు 1.7% నుంచి 1.4%కి తగ్గాయి.
News December 27, 2025
శనివారం రోజు చేయకూడని పనులివే..

శనిదేవుని ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే శనివారం రోజున జుట్టు, గోర్లు కత్తిరించడం, ఉప్పు, నూనె, ఇనుము, నల్ల మినపప్పు వంటి వస్తువులను కొనడం మానుకోవాలని పండితులు చెబుతున్నారు. మాంసం, మద్యానికి దూరంగా ఉంటూ పేదలను, నిస్సహాయులను వేధించకుండా ఉండాలని సూచిస్తున్నారు. ‘కూతురిని అత్తారింటికి పంపకూడదు. నూనె, నల్ల మినపప్పు దానం చేయాలి. ఫలితంగా శని ప్రభావం తగ్గి, జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయి’ అంటున్నారు.
News December 27, 2025
తిరుమల పరకామణి చోరీ.. హైకోర్టు కీలక ఆదేశాలు

తిరుమల పరకామణీ చోరీ కేసు నిందితుడు రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై నివేదికను హైకోర్టుకు ఏసీబీ డీజీ సమర్పించారు. పూర్తిగా పరిశీలించిన తర్వాత తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులోని తాజా పరిస్థితుల ఆధారంగా మరో FIR నమోదు చేయాల్సిన అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ అంశాన్ని పరిశీలించాలని సీఐడీకి సూచించింది. జనవరి 5వ తేదీకి విచారణ వాయిదా వేసింది.


