News December 25, 2025

రోజుకు 4.08 లక్షల లడ్డూల పంపిణీ: TTD ఛైర్మన్

image

AP: DEC 30 నుంచి ఆరంభమయ్యే వైకుంఠ ద్వార దర్శనాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ‘ప్రస్తుతం రోజుకు 4 లక్షల లడ్డూలు, 8వేల కళ్యాణోత్సవ లడ్డూలను భక్తులకు విక్రయిస్తున్నాం. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో వీటి తయారీని పెంచుతాం. లడ్డూల నాణ్యత, రుచి పెంచాం, క్యూలైన్లలో నిరీక్షణ తగ్గించాం’ అని పేర్కొన్నారు. ఆయన లడ్డూ తయారీ, విక్రయ కేంద్రాన్ని పరిశీలించి భక్తులతో మాట్లాడారు.

Similar News

News December 25, 2025

WPL: రేపు సాయంత్రం 6 గంటలకు టికెట్లు విడుదల

image

ఉమెన్ ప్రీమియర్ లీగ్(WPL)-2026 మ్యాచ్‌ల టికెట్లు రేపు సా.6 గంటలనుంచి అందుబాటులోకి రానున్నాయి. జనవరి 9న లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. నవీ ముంబై, వడోదరా వేదికల్లో ఈ సీజన్ మ్యాచులు జరగనున్నాయి. మొత్తం 5 జట్లు పాల్గొననుండగా ఎలిమినేటర్, ఫైనల్‌తో కలుపుకొని 22 మ్యాచులు ఉన్నాయి. ఫిబ్రవరి 5న ఫైనల్ జరగనుంది. వెబ్‌సైట్: https://www.wplt20.com/.

News December 25, 2025

తగ్గనున్న చలిగాలులు.. జనవరి నెలాఖరులో వర్షాలు!

image

TG: రాష్ట్రంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న చలిగాలుల ప్రభావం ఈ నెల 31 తర్వాత తగ్గనుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత సాధారణ శీతాకాల పరిస్థితులు నెలకొంటాయని పేర్కొన్నారు. అయితే జనవరి చివరి వారంలో తిరిగి చలిగాలులు వీస్తాయని, అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇవాళ ఉదయం ఆసిఫాబాద్‌లోని గిన్నెదారిలో కనిష్ఠంగా 6.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News December 25, 2025

తెలుసా..?: 3 సార్లు ఫెయిలైతే సర్పంచ్ తొలగింపు

image

తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లో సర్పంచ్‌లకు అధికారాలతో పాటు విధుల గురించి ప్రస్తావించారు. కేటాయించిన నిధులు సరిగా ఖర్చు చేయకుంటే పాలకవర్గం మొత్తాన్ని రద్దు చేయొచ్చు. ఇక 2 నెలలకు ఓ సారి జరగాల్సిన గ్రామసభలు వరుసగా 3 సార్లు నిర్వహించకపోయినా సర్పంచ్‌ను తొలగించవచ్చు. ప్రజలకు అవగాహన, చైతన్యం పెరిగిన నేపథ్యంలో పాలకులు ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా పదవులు ఊడే అవకాశముంది జాగ్రత్త.