News December 19, 2025
రోజూ గుడ్లు పెట్టే కోళ్ల గురించి తెలుసా?

పౌల్ట్రీ పరిశ్రమలో అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి BV 380 రకం కోళ్లు. ఇవి వేడి, తేమ వాతావరణాలకు అనుకూలంగా ఉంటాయి. సంవత్సరానికి 308 గుడ్లు పెట్టడం ఈ కోళ్ల ప్రత్యేకత. BV 380 కోడి పిల్లలను 18 నుంచి 20 వారాల పాటు పెంచిన తర్వాత గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. గోధుమ రంగులో ఉండే ఈ గుడ్లు పెద్దగా ఉంటాయి. ఇవి ఏడాది పాటు గుడ్లు పెట్టి తర్వాత ఆపేస్తాయి. అప్పుడు వాటిని మాంసం కోసం విక్రయించవచ్చు.
Similar News
News December 20, 2025
KTR, హరీశ్ రావులకు KCR కీలక బాధ్యతలు

TG: పంచాయతీ ఎన్నికల ఫలితాలను BRS చీఫ్ KCR విశ్లేషించారు. ఫలితాలు పార్టీకి సానుకూలంగా ఉన్నాయన్న అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. రానున్న MPTC, ZPTC, MNP ఎన్నికల్లోనూ మరింత దూకుడుతో వెళ్లాలని పార్టీ సీనియర్లకు సూచించారు. దీనికోసం మున్సిపల్ ఎన్నికల బాధ్యతను పట్టణ ఓటర్లలో ఇమేజ్ ఉన్న KTRకు అప్పగించారు. అలాగే సీనియర్ నేత హరీశ్ రావు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సన్నద్ధతను పర్యవేక్షించనున్నారు.
News December 20, 2025
వివిధ పంటల్లో తెగుళ్లు – నివారణకు సూచనలు

☛ అన్ని కూరగాయ పంటల్లో అక్షింతల పురుగు, చిత్తపురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 2మి.లీ కలిపి పిచికారీ చేయాలి. వంగ, కాకర, ఆగాకర పంటలకు మాత్రం లీటరు నీటికి థయోడికార్బ్ 1 గ్రాము కలిపి పిచికారీ చేసుకోవాలి.
☛ మిరప, టమాటా, క్యాబేజీ వంటి పంటల్లో ఎండుతెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా మెటాలాక్సిల్ + మాంకోజెబ్ 2గ్రా. కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి.
News December 20, 2025
పొగమంచు అడ్డంకి.. మోదీ చాపర్ యూటర్న్

PM మోదీ పర్యటనకు పొగమంచు అడ్డంకిగా మారింది. కోల్‌కతా విమానాశ్రయం నుంచి పశ్చిమ బెంగాల్ నాడియా జిల్లాలోని తాహెర్‌పుర్ హెలిప్యాడ్‌కు బయల్దేరిన మోదీ హెలికాప్టర్ దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండ్ కాలేకపోయింది. కొద్దిసేపు చక్కర్లు కొట్టిన తర్వాత చాపర్ తిరిగి కోల్‌కతాకు వెళ్లిపోయింది. NH ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన PM, వాతావరణం అనుకూలించక వర్చువల్‌గానే మాట్లాడారు.


