News February 23, 2026
రోజూ గుమ్మడి గింజలు తింటే సంతాన సమస్యలకు చెక్!

గుమ్మడి గింజల్లో ప్రొటీన్స్, ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. రోజూ 30 గ్రాములు తింటే టైప్-2 డయాబెటిస్, హైబీపీ, సంతాన సమస్యలు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, PCOS, థైరాయిడ్, ఊబకాయం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా అవుతాయి. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. మంచి నిద్ర పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News February 24, 2026
వీటిని వంటగదిలో పెడుతున్నారా?

కిచెన్‌లో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. గ్యాస్ లీక్, కుక్కర్లు పేలడం, షార్ట్ సర్క్యూట్ వంటివి ఎప్పుడు ముంచుకొస్తాయో తెలియదు. ఫ్రిడ్జ్, ఓవెన్లు ఉంటే ప్రమాద తీవ్రత మరింత పెరుగుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే వీటిని వెంటిలేషన్ ఎక్కువగా వచ్చే ప్రాంతంలో పెట్టాలి. అలాగే ఒవెన్, ఫ్రిడ్జ్, గ్యాస్ స్టవ్ దూరంగా ఉంచాలి. ఓవర్ లోడింగ్, విద్యుత్ హెచ్చుతగ్గులు, పాత వస్తువులు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి.
News February 24, 2026
టీమ్ ఇండియా ఓటమి

బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా ఓటమిపాలైంది. తొలుత భారత్ 214 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆసీస్ 38.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మూనీ (76), హీలీ (50), సదర్‌లాండ్(48*) రాణించారు. ఫిబ్రవరి 27, మార్చి 1 తేదీల్లో మరో రెండు వన్డేలు జరగనున్నాయి.
News February 24, 2026
ఎందుకలా?!: భూమి తిరుగుతున్నా మనం ఒకేచోట..

భూమి భూమధ్యరేఖ వద్ద 1,600kmph+ వేగంతో తిరిగినా మనం ఒకేచోట ఉంటాం. భూమితో పాటు మనుషులు, చెట్లు, సముద్రాలు ఒకే వేగంతో తిరగడం వల్ల మనకు ఆ మార్పు తెలియదు. మన ఇంద్రియాలు అకస్మాత్తుగా వచ్చే మార్పునే గుర్తిస్తాయి. ఇక భూమి తిరగడం వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ (బయటకు తోసే శక్తి) పని చేసినా అది భూగురుత్వాకర్షణ శక్తితో పోలిస్తే చాలా తక్కువ ఉండటం వల్ల మనలో కదలిక ఉండదు. రోజూ 4pmకు ఇలా ఓ కొత్త విషయం ఎందుకలా?!లో..


