News December 11, 2025

రోజ్మేరీ ఆయిల్‌తో ఎన్నో లాభాలు

image

రోజ్మేరీ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు కుదుళ్లను ప్రేరేపిస్తుంది. క్రమంగా జుట్టు రాలడాన్ని నివారించి.. హెయిర్ గ్రోత్ అయ్యేలా చేస్తుంది. స్కాల్ప్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చుండ్రు, దురద వంటి సమస్యలతో పోరాడతాయి. దీనిలోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తగ్గించి.. స్కాల్ప్​ ఆరోగ్యంగా ఉండేలా హెల్ప్ చేస్తాయి

Similar News

News December 14, 2025

కుంకుమను ఇంట్లోనే తయారు చేసుకోండిలా..

image

మార్కెట్‌లో దొరికే నకిలీ కుంకుమతో చర్మ సమస్యలు రావొచ్చు. అయితే ఇంట్లోనే సహజంగా కుంకుమను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం పసుపు, సున్నం ఉంటే చాలు. ముందుగా ఆర్గానిక్ పసుపు తీసుకోవాలి. అందులో చిటికెడు సున్నం వేయాలి. ఆ తర్వాత నాలుగైదు చుక్కల నీళ్లు పోసి బాగా కలపాలి. సున్నం వేయడం వల్ల ఆ మిశ్రమం ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ మిశ్రమాన్ని ఎండలో ఆరబెడితే పొడిగా మారి, నాణ్యమైన కుంకుమ తయారవుతుంది.

News December 14, 2025

మెస్సీ వెంట ఉన్న ప్లేయర్ల గురించి తెలుసా?

image

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీతో, ఇద్దరు ప్లేయర్లు రోడ్రిగో డిపాల్(అర్జెంటీనా), లూయిస్ సువారెజ్(ఉరుగ్వే) భారత పర్యటనలో ఉన్నారు. వీరు US మేజర్ లీగ్ సాకర్ క్లబ్ ఇంటర్ మయామికి ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం. మిడ్ ఫీల్డర్ అయిన రోడ్రిగో(RHS).. 2022లో ఫిఫా వరల్డ్‌కప్ గెలిచిన అర్జెంటీనా జట్టులో సభ్యుడు. మరో ప్లేయర్ సువారెజ్(LHS) స్ట్రైకర్‌గా పేరొందారు. యూరప్ లీగ్‌లో 2 సార్లు గోల్డెన్ బూట్ గెలుచుకున్నారు.

News December 14, 2025

INDvsSA.. గెలుపు ఎవరిదో?

image

టీ20 సిరీస్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా ఇవాళ టీమ్ ఇండియాతో దక్షిణాఫ్రికా మూడో మ్యాచ్ ఆడనుంది. తొలి రెండు మ్యాచుల్లో చెరో విజయంతో ఇరు జట్ల ఫోకస్ ఈ మ్యాచ్ నెగ్గడంపైనే ఉంది. రెండో T20లో నెగ్గిన సఫారీ ప్లేయర్లు అదే జోష్‌లో ఉన్నారు. అటు ఓటమితో కంగుతిన్న టీమ్ ఇండియా ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని కసిగా ఉంది. మ్యాచ్ 7pm నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్‌లో లైవ్ చూడవచ్చు.