News December 24, 2025
రోడ్డుపైనే సర్జరీ చేసిన డాక్టర్లు.. నెటిజన్ల ప్రశంసలు

ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాపాడేందుకు ముగ్గురు డాక్టర్లు రోడ్డుపైనే సర్జరీ చేశారు. కేరళలో జరిగిన ప్రమాదంలో లీనూ అనే వ్యక్తి గాయపడి శ్వాస ఆడక ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో వచ్చిన డా.థామస్ పీటర్, దిదేయా థామస్, మనూప్ ఫ్లాష్‌లైట్ వెలుతురులో బ్లేడ్, స్ట్రాతో సర్జరీ చేసి ఆసుపత్రికి తరలించే వరకూ ప్రాణాలను నిలబెట్టారు. లినూ చికిత్స పొందుతూ మృతి చెందినప్పటికీ వైద్యులు చేసిన పనికి ప్రశంసలు దక్కుతున్నాయి.
Similar News
News December 24, 2025
మేకర్స్ Vs థియేటర్ ఓనర్స్.. ఫ్యాన్స్ వర్రీస్

టికెట్ రేట్ కంటే థియేటర్ల పాప్‌కార్న్ ధరే ఎక్కువన్న డైరెక్టర్ తేజ <<18658964>>కామెంట్స్<<>> చర్చనీయాంశమయ్యాయి. అది వాస్తవమే అయినా ప్రీమియర్స్ పేరిట టికెట్ ధరను రూ.600 చేయడం కరెక్టేనా? ఒకప్పుడు 10/20 రూపాయలకే టాకీస్‌లో సినిమా చూసిన సామాన్య సినీ అభిమాని ఇప్పుడు థియేటర్ అంటేనే ‘అమ్మో’ అంటున్నాడు. టికెట్ ధరలు భారీగా పెంచడంతో పాటు పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ పేరిట దోపిడీతో సినిమా చూడాలంటే వేల రూపాయలు పెట్టాల్సిందే.
News December 24, 2025
మాడిన వేప చెట్లు మళ్లీ పచ్చగా మారతాయా?

‘ఫోమోప్సిస్ అజాడిరక్టే’ ఫంగస్ వ్యాధి వేప చెట్టుకు మాత్రమే సోకుతుంది. ఇది ప్రధానంగా వర్షాకాలం ముగిసి, శీతాకాలం ప్రారంభంలో వ్యాప్తి చెందుతుంది. అందుకే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలా వేప చెట్లు పత్రహరితం కోల్పోయి, పూర్తిగా ఎండిపోతాయి. మళ్లీ ఈ చెట్లన్నీ మార్చి నెల నాటికి యథావిథిగా పచ్చగా మారతాయి. గతంలో ఉత్తర భారతదేశంలో కనిపించిన ఈ వ్యాధి, ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని వేప చెట్లలో కూడా కనిపిస్తోంది.
News December 24, 2025
ఢిల్లీ మెట్రోకు కేంద్రం నిధులు.. TG ఎదురుచూపు!

ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 16km మేర ఢిల్లీ మెట్రో విస్తరణకు రూ.12,015 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏళ్లుగా నిరీక్షిస్తున్న హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దీంతో HYD మెట్రో విస్తరణ మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది. తెలంగాణ ప్రభుత్వం మెట్రోను అధీనంలోకి తీసుకోనున్నట్లు ఇప్పటికే తెలిపింది. ప్రస్తుతం HYDలో 69.2km మెట్రో మార్గం విస్తరించి ఉంది.


