News April 18, 2024
రోడ్డుప్రమాదంలో BRS నేత మృతి ఘటన.. కేసు నమోదు

నల్గొండలో జరిగిన రోడ్డుప్రమాదంలో సినీ నటుడు రఘుబాబు కారు తగిలి <<13072708>>బీఆర్ఎస్ నేత జనార్ధన్ రావు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అజాగ్రత్తగా కారు నడిపి రఘుబాబు తన భర్త మృతికి కారణమయ్యారని ఆమె పేర్కొన్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్సై నాగరాజు వెల్లడించారు.
Similar News
News November 14, 2025
NLG: నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలు: జిల్లా ఎస్పీ

నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా నల్గొండలోని సెయింట్ ఆల్ఫన్స్ పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కంప్యూటర్ యుగంలో యువత చిన్న వయస్సులో మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
News November 14, 2025
NLG: చదువే ధ్యేయంగా బాలికలు ముందుకు సాగాలి: కలెక్టర్

బాలికలు చదువునే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకు సాగాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
News November 14, 2025
NLG: చేప పిల్లలు నాసిరకం: మత్స్యకారులు

జిల్లాలో చేప పిల్లల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. చెరువులు, కుంటలకు పూర్తిగా నాసిరకం సీడ్ వస్తున్నదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 6 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనుండగా.. ఇప్పటివరకు 60 లక్షలకు పైగానే చేప పిల్లలు పంపిణీ చేశారు. జిల్లాలోని ముత్యాలమ్మ చెరువు, కోతకుంట, ఉంగూరుకుంట చెరువులకు పంపిణీ చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉన్నాయని మత్స్యకారులు ఆరోపించారు.


