News April 13, 2025

రోడ్డు ప్రమాదంలో అనకాప్లలి వాసి మృతి

image

అనాకపల్లికి చెందిన డ్రైవర్ నాగరాజు ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇసుక లోడ్ కోసం వెళ్తుండగా రేగిడి (M)రెడ్డి పేట సెంటర్ వద్ద టిప్పర్ అదుపుతప్పి చెట్టుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగరాజు క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. తనను కాపాడాలంటూ చేసిన ఆర్తనాదాలతో తోటి డ్రైవర్లు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నాగరాజును బయటికి తీసేందుకు ప్రయత్నించగా అప్పటికే చనిపోయాడు.

Similar News

News December 14, 2025

వికారాబాద్‌లో ముగిసిన రెండో విడత పల్లె పోరు

image

వికారాబాద్ జిల్లాలోని 7 మండలాల్లో 175 గ్రామ పంచాయతీలకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట వార్డు సభ్యుల బ్యాలెట్లు లెక్కించి, వెంటనే సర్పంచ్ కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. దీంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది

News December 14, 2025

పాలమూరు: ముగిసిన పోలింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 565 గ్రామ పంచాయతీలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో గేటు లోపల ఉన్న ఓటర్లకు అనుమతించి పోలింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ముందుగా వార్డు సభ్యుల బ్యాలెట్లను లెక్కించనున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

News December 14, 2025

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

image

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. మ.2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా, సా.5గంటలలోపు ఫలితాలు వచ్చే అవకాశముంది. రెండో విడతలో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 3,911 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ లైవ్ అప్డేట్స్ వే2న్యూస్‌లో తెలుసుకోవచ్చు.