News July 7, 2025

రోడ్డు ప్రమాదంలో ఆపరేషన్ సింధూర్ జవాన్ మృతి

image

పెదనందిపాడు మండలం వరగానికి చెందిన నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భారత్-పాక్ యుద్ధ సమయంలో ఆపరేషన్ సింధూర్‌లో సేవలందించిన ఆయన, కుటుంబంతో హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా నల్గొండ దగ్గర వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో నాగేశ్వరరావు కుమారుడు అవినాశ్ అక్కడికక్కడే మృతి చెందగా, నాగేశ్వరరావు చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో మరణించారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

Similar News

News July 7, 2025

NGKL: విద్యుత్ శాఖ ఇన్‌ఛార్జ్ SEగా నరసింహారెడ్డి

image

నాగర్‌కర్నూల్ జిల్లా విద్యుత్ ఇన్‌ఛార్జ్ SEగా నరసింహారెడ్డిని నియమిస్తూ సీఎండీ ముష్రఫ్ ఫారుకి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నరసింహారెడ్డి ప్రస్తుతం మేడ్చల్ డీఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు అదనంగా ఎస్‌ఈ బాధ్యతలను అప్పగించారు. ఉమ్మడి జిల్లాలో కల్వకుర్తి, జడ్చర్ల ప్రాంతాలలో ఆయన ఏడీఈ, డీఈగా నిర్వహించారు. మరోసారి జిల్లాకు రావడం పట్ల విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 7, 2025

బాపట్ల పీజీఆర్ఎస్‌లో 55 అర్జీల: ఎస్పీ

image

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ తుషార్ డూడి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 55 అర్జీలు అందినట్లు తెలిపారు. ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని సూచించారు.

News July 7, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ పామర్రులో దొంగల ముఠాను అరెస్ట్
☞కృష్ణా: అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ
☞ మచిలీపట్నం: స్పందనలో అర్జీలు స్వీకరించిన అధికారులు
☞ ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్‌ను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
☞నూజివీడు: IIITలో 141 సీట్లు ఖాళీ
☞ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఆందోళన