News February 27, 2025
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

రొద్దం మండల సమీపంలోని దొమ్మత మర్రివద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంలో రెడ్డి పల్లి నుంచి లేపాక్షికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని హిందూపురం ఆసుపత్రికి తరలించగా తిరుమలేశ్, భరత్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 27, 2025
IIT కాలేజీ స్క్రీన్‌పై పోర్న్: పిట్రోడాకు స్ట్రాంగ్ కౌంటర్

IIT రాంచీ వెబ్‌కాస్టులో మాట్లాడుతుండగా సిస్టమ్‌ను ఎవరో హ్యాక్ చేసి పోర్న్ ప్లే చేశారన్న శామ్ పిట్రోడా ఆరోపణలను EDU మినిస్ట్రీ ఖండించింది. ‘అసలు రాంచీలో IITనే లేదు. అక్కడుంది IIIT. పిట్రోడాను ఫిజికల్/డిజిటల్‌గా లెక్చరివ్వడానికి పిలవలేదని వారూ స్పష్టం చేశారు. దీన్ని బట్టి IITలను అపఖ్యాతి పాలు చేయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. మేం దీనిని సహించం. లీగల్ యాక్షన్ తీసుకుంటాం’ అని ట్వీట్ చేసింది.
News February 27, 2025
మే 2న కేదార్‌నాథ్ ఆలయం ఓపెన్

చార్‌ధామ్ యాత్రలో కీలకమైన కేదార్‌నాథ్ ఆలయాన్ని మే 2న ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆలయ కమిటీ అధికారి విజయ్ ప్రసాద్ తెలిపారు. దీంతోపాటు ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల్లో ఉన్న గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 30న, బద్రీనాథ్ గుడిని మే 4న తెరవనున్నారు. ఈ నాలుగు ఆలయాలను కలిపి చార్‌ధామ్‌గా పిలుస్తారు. మంచు, విపరీతమైన చలి కారణంగా ఈ ఆలయాలను సంవత్సరంలో కొన్ని నెలలే తెరుస్తారు.
News February 27, 2025
మహా నగరంలో.. మహా శివరాత్రి ఎఫెక్ట్

ట్రాఫిక్ జామ్‌లతో నిండిపోయే మహానగరపు రోడ్లు ఇవాళ కాస్త ఖాళీగా కనిపించాయి. మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో జాగరణలో గడిపారు. ఈ ఎఫెక్ట్‌తో ఉదయం లేట్‌గా రోడ్లపైకి వస్తుండటంతో 11 తర్వాత వాహనాలు పెరిగాయి. JNTU, మియాపూర్, బాచుపల్లి, మాదాపూర్, సికింద్రాబాద్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, ABIDS, DSNR వంటి బిజీరోడ్లపై ఇప్పుడిప్పుడే హారన్‌మోతలు పెరిగాయి. మీప్రాంతంలో రద్దీగా ఉందా? కామెంట్ చేయండి.