News March 7, 2025
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నెల్లూరు యువకులు దుర్మరణం

చెన్నైలో చదువుకుంటున్న స్నేహితుడిని చూసేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురై నెల్లూరుకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. న్యాయవాది గుడుగుంట వేణుగోపాల్ కుమారుడు శ్రేయాశ్‌తో పాటు ప్రముఖ ట్రాన్స్‌పోర్టర్ అధినేత కుమారుడు ధనిశ్ రెడ్డి చెన్నైలో కారులో వెళ్తూ లారీని ఢీకొన్నారు. దీంతో స్నేహితులిద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణంతో నెల్లూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 9, 2025
నెల్లూరు : మాజీ ఛైర్మన్ ఇక లేరు

నెల్లూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేత, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం మాజీ ఛైర్మన్, కొచ్చిన్, గోవా పోర్టు ట్రస్ట్ మాజీ సభ్యులు పత్తి రవీంద్రబాబు అనారోగ్య సమస్యల కారణంగా శనివారం రాత్రి మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా ఆయన పలు పదవులను పొంది పలువురి మన్ననలు కూడా అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
News March 9, 2025
ఉచిత బస్సు తుస్సు.. గ్యాస్ సిలిండర్లు. బుస్సు: కాకాణి

ఉచిత బస్సు తుస్సు – గ్యాస్ సిలిండర్లు బుస్సు అని టీడీపీ సూపర్ సిక్స్ పథకాలపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సెటైర్లు వేశారు. పొదలకూరు మండలంలో ఆయన శనివారం పర్యటించారు. కూటమి పాలన బాగా లేదంటే కాకాణి సమక్షంలో ప్రజలు పెదవి విరిచారు. చంద్రబాబుకి మోసం చేయడంతోనే కలిసి వస్తుందని కాకాణి ఎద్దేవా చేశారు.
News March 8, 2025
కావలి వైసీపీ నేత సుకుమార్ రెడ్డి సస్పెండ్

కావలి నియోజకవర్గం YCP నేత, కావలి మాజీ ఏఎంసీ ఛైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసినట్లు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. సుకుమార్ రెడ్డి సస్పెన్షన్ లేఖను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.