News April 15, 2025

రోడ్డు ప్రమాదంలో కొత్తకోట యువకుడి మృతి

image

ఆదుకుంటాడనుకున్న కొడుకు అనంత లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు అచ్చి బాబు, రమణమ్మ శోక సంద్రంలో మునిగిపోయారు. కొత్తకోట గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ కాకినాడ జిల్లా మూలపేట వద్ద ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత మృతదేహాన్ని సోమవారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. అచేతనంగా పడి ఉన్న కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రుల ఆర్తనాదాలు నింగినంటాయి.

Similar News

News April 16, 2025

ఆ రేప్ సీన్ పూర్తికాగానే వామిటింగ్ చేసుకున్నా: హీరోయిన్

image

‘కాఫిర్’ మూవీలోని రేప్ సీన్‌లో నటించిన సమయంలో వణికిపోయినట్లు హీరోయిన్ దియా మీర్జా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘సీన్ షూట్ పూర్తికాగానే వామిటింగ్ చేసుకున్నా. సన్నివేశం డిమాండ్ చేసినప్పుడు అందులో లీనం కావాలి. అప్పుడే పూర్తి న్యాయం చేయగలుగుతాం’ అని చెప్పారు. షెహనాజ్ పర్వీన్ అనే పాకిస్థానీ మహిళ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఆమె దారితప్పి INDలోకి ప్రవేశించి, ఎనిమిదేళ్లు జైలుశిక్ష అనుభవించింది.

News April 16, 2025

శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్న NDSA బృందం

image

తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టును NDSA(నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) ఛైర్మన్ అనిల్ జైన్ ఈ నెల 29న పరిశీలించనున్నారు. ప్రాజెక్టు సమస్యలు, భద్రతను తనిఖీ చేసిన అనంతరం ఇరు రాష్ట్రాల అధికారులతో భేటీ అవుతారు. అంతకంటే ముందు 28న ఏపీ అధికారులతో, 30న HYDలో తెలంగాణ అధికారులతో విడివిడిగా సమావేశమై చర్చలు జరపనున్నారు.

News April 16, 2025

ప్రియుడి పేరుతో లాకెట్.. ఖుషీ ఫొటోలు వైరల్

image

జాన్వీ కపూర్ చెల్లి ఖుషీ కపూర్ ప్రేమ వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది. నటుడు వేదాంగ్ రైనాతో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఖుషీ V, K లెటర్స్ గల చైన్‌ను ధరించి దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. క్యాప్షన్‌గా లవ్ ఎమోజీని పెట్టారు. తన ప్రేమను వ్యక్తపరచడానికే ఆమె ఇలా చేసినట్లు తెలుస్తోంది. గతేడాది మాల్దీవుల వెకేషన్‌లోనూ ఖుషీ V అక్షరం గల బ్రేస్‌లెట్ ధరించారు.

error: Content is protected !!