News December 31, 2025
రోడ్డు ప్రమాదంలో దేవరాపల్లి యువకుడి మృతి

వేపాడ(M) కుమ్మపల్లి జంక్షన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరాపల్లి మండలం కొత్తూరు ముత్యాలమ్మపాలెం గ్రామానికి చెందిన దేముడు నాయుడు(26) మృతి చెందాడు. కొత్తవలస నుంచి బైక్‌పై వస్తుండగా దేవరాపల్లి నుంచి వెళ్తున్న 12–డి బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా అదుపుతప్పి పడిపోయారు. తీవ్రమైన గాయాలతో దేముడు నాయుడు అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. బండి నడుపుతున్న మహేశ్ గాయపడగా చికిత్స పొందుతున్నారు.
Similar News
News February 21, 2026
కామారెడ్డికి రానున్న BJP రాష్ట్ర అధ్యక్షుడు

కామారెడ్డిలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కామారెడ్డికి రానున్నారు. సాయంత్రం మూడు గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని రమణారెడ్డితో భేటీ కానున్నట్లు సమాచారం. ఉద్రిక్తత పరిస్థితులకు గల కారణాలను తెలుసుకోనున్నారు.
News February 21, 2026
చిత్తూరు: ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయండి!

చిత్తూరులో జరిగే గ్రీవెన్స్ డే కోసం ఎంతోమంది కష్టపడి వస్తుంటారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు స్వీకరిస్తోంది. http//:pgrs.ap.gov.in వెబ్ సైట్‌లో మీ సమస్యను నమోదు చేసి రసీదు పొందవచ్చు. అలాగే 1100కి ఫోన్ చేసి సమస్య చెప్పినా నమోదు చేసుకుంటున్నారు. ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు.
News February 21, 2026
కెరీర్ గైడెన్స్.. కాల్ చేసి సరైన మార్గాన్ని ఎంచుకోండి!

టెన్త్, ఇంటర్ తర్వాత ఏం చేయాలనే సందేహంలో మీ పిల్లలున్నారా? అలాంటి వారికి సరైన మార్గాన్ని సూచించేందుకు తెలంగాణ ప్రభుత్వం కెరీర్ గైడెన్స్ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. విద్యార్థులు భవిష్యత్తులో సరైన కోర్సులను ఎంచుకునేందుకు 1800 425 2428 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు పొందవచ్చు. ఆదివారం మినహా ప్రతిరోజూ 9AM నుంచి 6PM వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. SHARE IT


