News June 11, 2024

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం

image

బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కలువాయి మండలానికి చెందిన డిస్కం ఏఈ యశ్వంత్(26) మృతి చెందాడు. స్థానికులు వివరాల ప్రకారం.. యశ్వంత్ రెండు రోజుల క్రితం బెంగళూరు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇతని కుటుంబ సభ్యులు నెల్లూరులో నివాసముంటున్నారు.

Similar News

News February 18, 2026

నెల్లూరులో కనిపించిన నెలవంక.. టైమింగ్స్ ఇవే

image

నెల్లూరు జిల్లాలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం మొదలైంది. చిన్నాపెద్ద తేడా లేకుండా కఠోర ఉపవాస దీక్షలకు ముస్లిం సోదరులు సిద్ధమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసంలో ఉంటారు. తర్వాత ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గురువారం సమయాలు ఇలా ఉన్నాయి.
సహరి: ఉదయం 5.12గంటలకు
ఇప్తార్: సాయంత్రం 6:16 గంటలకు

News February 18, 2026

నుడాలో రూ.32.50 కోట్ల పనులకు ప్రతిపాదనలు

image

నుడా పరిధిలో రూ.32.50 కోట్ల పనులకు ప్రతిపాదనలు వచ్చినట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. వాటిల్లో రూ.28.60 కోట్ల పనులు మంజూరైనట్లు వివరించారు. నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన అధికారులతో సమీక్ష జరిగింది. జేసీ మాట్లాడారు. రాష్ట్రంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు అధికారులు అందరూ సహకరించాలన్నారు.

News February 18, 2026

నెల్లూరు: ఆ 6 గ్రామాల్లో సోలార్ సిస్టం

image

‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’ కింద నెల్లూరు జిల్లాలో ఆరు పల్లెలను మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రకటించారు. తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో తొలి విడతగా లేగుంటపాడు, బిట్రగుంట, మహిమలూరు, కలివేలపాలెం, మనుబోలు, కాకుపల్లిలో సోలార్ సిస్టం ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యుత్తు ఆదాతో పాటు ప్రజలకు ఆదాయం వస్తుందన్నారు.