News July 5, 2024
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్.. ఐదుగురికి ప్రాణదానం

రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబీకులు ముందుకొచ్చారు. మంగళగిరికి చెందిన న్యాయవాది ప్రసాద్‌కు 2రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరగగా NRI ఆసుపత్రికి తరలించారు. కాగా వైద్యులు ప్రసాద్‌కు బ్రెయిన్ డెడ్‌గా నిర్థారించారు. అతని అవయువాలను శుక్రవారం మధ్యాహ్నం NRI నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తిరుపతికి తరలించనున్నారు.
Similar News
News February 17, 2026
గుంటూరులో CBSE టెన్త్ పరీక్షలు షురూ

గుంటూరు జిల్లాలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉదయాన్నే చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతున్నాయి.
News February 17, 2026
గుంటూరులో శాప్ లీగ్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) రూపొందించిన శాప్ లీగ్ పోస్టర్‌ను కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలోని అట్టడుగు (Grassroot level) ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడమే లక్ష్యంగా నూతన క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు, పాఠశాల స్థాయి విద్యార్థులు పాల్గొంటారన్నారు.