News January 9, 2026

రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల విద్యార్థి దుర్మరణం

image

రంగారెడ్డి జిల్లాలోని మోకిల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్‌కు చెందిన విద్యార్థి దుర్మరణం చెందారు. మంచిర్యాలకు చెందిన దేవుళ్ళ సూర్యతేజ హైదారాబాద్‌లో చదువుతున్నాడు. స్నేహితుడి బర్త్ డే వేడుకలు జరుపుకొని స్నేహితులతో కలసి కారులో తిరిగి వస్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.

Similar News

News February 16, 2026

NTR జిల్లా కలెక్టరేట్‌కు 145 అర్జీలు

image

కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మొత్తం 145 అర్జీలు అందినట్లు అధికారులు వెల్లడించారు. 62 రెవెన్యూ, 83 రెవెన్యూయేతర అర్జీలు ఉన్నాయన్నారు. ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టి, నిర్దేశిత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలన్నారు.

News February 16, 2026

ఏపీ నుంచి ఇసుక రవాణాపై ఖమ్మం సీపీ హెచ్చరిక

image

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఏపీ నుంచి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటల నిఘా కొనసాగించాలన్నారు. అక్రమ రవాణా, నిల్వలపై కేసులు నమోదు చేసి వాహనాలను జప్తు చేయాలని తెలిపారు. స్థానిక అవసరాలకు మైనింగ్ నిబంధనల ప్రకారం ఇసుక వినియోగించాలని కాంట్రాక్టర్‌లకు సూచించారు.

News February 16, 2026

HYD: మీరూ సింగిల్‌గా ఉన్నారా?

image

ఒంటరి జీవితంతో యువతలో మానసిక వేదన పెరుగుతోందని కాప్రా డా.సువర్ణ తెలిపారు. గ్రేటర్ పరిధిలో యువతకు 34 ఏళ్లు దాటినా సింగిల్‌గా ఉంటున్నారని తెలిపారు. దీనికి కారణం పెళ్లిళ్లు కాకపోవడం, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కుంగిపోతున్నారని వివిధ సర్వేల్లో వెల్లడైనట్లు పేర్కొన్నారు. యుక్త వయసులో వృత్తి కోర్సులను ఎంచుకోవడం, కుటుంబంతో కలిసి ఉండటం, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని సూచించారు.