News February 27, 2025
రోడ్డు ప్రమాదంలో రాజమండ్రి వాసి మృతి

కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా కొర్రపాటి నాగ మురళి శివప్రసాద్ (45) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతి చెందాడు. దీంతో ఆయన నివాస ప్రాంతo అన్నపూర్ణమ్మ పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటో డ్రైవర్‌గా ఉన్న శివప్రసాద్ గత వారం కుంభమేళాకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బీహార్‌లోని గయలో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నేడు రాజమండ్రికి ఆయన భౌతికకాయం రానుంది.
Similar News
News February 27, 2025
రాజమండ్రి: నదీజలాలను సంరక్షించండి- కమిషనర్

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నదీ జలాలను సంరక్షించే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. ప్రజలందరూ దీనిలో పాల్గొనాలని కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు డ్రాయింగ్ పోటీలు, బోట్ రేస్, మ్యూరల్ పెయింటింగ్, ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు నోడల్ అధికారిగా ఇంజినీర్ షేక్ మదర్షా అలీని కమిషనర్ నియమించారు.
News February 26, 2025
నల్లజర్ల: రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు

ఏపీలో రేపు ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మండలాల వారీగా నిర్దేశించిన పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8:00 నుంచి సాయంత్రం 4:00గంటల వరకు పోలింగ్ జరగనుంది. గతంలో 2019 మార్చి ఎమ్మెల్సీ ఎన్నికలలో 11 మంది బరిలో దిగగా, ఈసారి 35 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. గోపాలపురం పరిధిలో ఓటర్లు 6443, గోపాలపురం 1777, దేవరపల్లి 2166, నల్లజర్ల 2500గా ఓటర్లు ఉన్నారు.
News February 26, 2025
మృతదేహాలు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం అంతా మహా శివరాత్రి పర్వదినాన ఆ గ్రామం అంతా విషాదంతో నిండిపోయింది. నది స్థానానికి దిగిన 11 మందిలో ఐదుగురు గల్లంతయి మృత్యువాత పడ్డారు. దీంతో కలెక్టర్ ప్రశాంతి ఉదయం నుంచి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయంతో వెలికితీసిన మృతదేహాలను పంచనామా నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.