News October 19, 2025
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి: అనకాపల్లి ఎస్‌ఐ

అనకాపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పిసినికాడ జాతీయ రహదారి వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘనటలో గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు అనకాపల్లి రూరల్ ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. మృతుని వయసు 45 సంవత్సరాలు ఉంటాయన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News October 19, 2025
ASF: ‘పది’లో ‘శత’శాతమే లక్ష్యంగా..!

పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే చివరి స్థానాల్లో ఉన్న జిల్లాను మెరుగుపరిచేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. శతశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా.. జిల్లాలోని 77 ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 3,598 మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించింది. ఈ తరగతులు జనవరి 9 వరకు కొనసాగుతాయి. అభ్యాసన మెరుగుదల కోసం విద్యార్థులకు ప్రతి వారాంతంలో పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
News October 19, 2025
‘పది’లో ఆదిలాబాద్ ప్రత్యేకంగా నిలిచేలా

గతేడాది పదో తరగతిలో జిల్లా 97.95% ఉత్తీర్ణత సాధించి, రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. ఈసారి కూడా అదే తరహాలో మరింత పకడ్బందీగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జిల్లాలోని 130 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 6,354 మంది విద్యార్థులకు ఇప్పటికే అభ్యసన దీపికలు, పోషకాలతో కూడిన బ్రెడ్ అందిస్తున్నారు. రోజూ సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి.
News October 19, 2025
ప్రత్తిపాడు: ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు

ప్రత్తిపాడు (M) ధర్మవరం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బైకు లారీని వెనుక వైపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. దీపావళి పండుగ నేపథ్యంలో విజయవాడ నుంచి ఇచ్చాపురం వెళ్తున్న వసంత్ కుమార్ సంధ్య దంపతులు ఆగి ఉన్న ఒక వ్యాను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. వసంత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. పండగ వేళ ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.