News January 6, 2026

రోడ్డు ప్రమాదంలో సిక్కోలు వాసి మృతి

image

విజయనగరం జిల్లా పూసపాటిరేగ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిగం మండలం కాపుతెంబూరు గ్రామానికి చెందిన జీ.నగేశ్ (30) అనే యువకుడు దుర్మరణం చెందారు. విజయవాడ నుంచి లగేజీ వ్యాన్‌పై టెక్కలి వైపు సామాగ్రి తీసుకువస్తుండగా రోడ్డుపక్కన బండి ఆపి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News February 7, 2026

ఎచ్చెర్ల: అందుబాటులో 16 పీజీ కోర్సులు

image

పీజీ కోర్సుల ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు మార్చి 11లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో గత ఏడాది 16 కోర్సుల్లో ప్రవేశాలు జరిగాయి. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు ఈ పీజీ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బిడ్డికి అడ్డయ్య కోరారు.

News February 7, 2026

అర్హత గల ప్రతి పేదవానికి పక్కా ఇల్లు నిర్మిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

image

రాష్ట్రంలో అర్హతగల ప్రతి పేదవానికి పక్కాఇల్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం సంతబొమ్మాళి మండలం నౌపడ కూడలి వద్ద పేదలకు ఇళ్ల పట్టాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేసారు. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే CM ధ్యేయం అన్నారు. ఆర్‌డీఓ ఎం.కృష్ణమూర్తి, AMC ఛైర్మన్ బీ.వెంకటరమణమ్మ, తహశీల్దార్ హేమసుందర్ రావు పాల్గొన్నారు.