News January 3, 2026

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు: భూపాలపల్లి కలెక్టర్

image

పోలీస్, రవాణా, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారులు, వైద్య, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులతో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి పోలీస్, రవాణ, ఆర్‌అండ్‌బీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ప్రమాదాల నియంత్రణకు తగుచర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రతిపాదన చేశారు.

Similar News

News January 27, 2026

అల్లూరి: మద్యం మత్తులో అన్నంలో విషం కలిపి తిని వ్యక్తి మృతి

image

చింతూరు(M) పేగ పంచాయతీ ఇర్కంపేటలో సోమవారం రాత్రి ఎం.కోసయ్య(45) అనే వ్యక్తి మద్యం మత్తులో అన్నంలో పక్షులను వేటాడే మందు కలిపి తిన్నాడు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న అతనిని భార్య అంబులెన్సులో ఏడుగురాళ్లపల్లి పీహెచ్సీకి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. అదే ఇంట్లో 2 నుంచి 8 సం. వయస్సుగల అయిదుగురు పిల్లలు, ఓ మహిళ అదే అన్నం తిని మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

News January 27, 2026

అతి త్వరలో సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల!

image

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2026 నోటిఫికేషన్ ఈ వారంలోనే విడుదల కానుంది. జనవరి 14న నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా… అడ్మినిస్ట్రేషన్ కారణాలతో ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం మే 24న ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన లేదా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తుకు అర్హులు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://upsc.gov.in/

News January 27, 2026

ఈయూతో డీల్.. వీటి ధరలు తగ్గుతాయి

image

ఇండియా-EU మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్ <<18971975>>కుదిరిన<<>> విషయం తెలిసిందే. దీంతో EU దేశాల నుంచి వచ్చే 96.6% వస్తువులపై సుంకాలు ఉండవు/తగ్గుతాయి. పలు కార్లు, ఆలివ్ ఆయిల్, కివీస్, స్పిరిట్స్ (విస్కీ, వోడ్కా వంటివి), బీర్, వైన్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రూట్ జ్యూస్ ధరలు దిగొస్తాయి. ఈ డీల్‌తో 90%పైగా భారత ఉత్పత్తులకు యూరప్ మార్కెట్లో సుంకాలు ఉండవని తెలుస్తోంది. టెక్స్‌టైల్స్, కెమికల్స్, జువెలరీ రంగాలకు సపోర్ట్ దక్కనుంది.