News June 29, 2024

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి క్లయిమ్ సెటిల్మెంట్ కమిటీ, రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు.

Similar News

News July 1, 2024

కదిరిలో మహిళపై అత్యాచారయత్నం

image

కదిరి మండలంలోని ఓ గ్రామంలో మహిళపై అత్యాచారయత్నం జరిగిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన భాను ప్రతాప్ రెడ్డి అదే గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై శనివారం రాత్రి అత్యాచారయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మేరకు బాధితురాలు భర్తతో కలిసి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ మోహన్ తెలిపారు.

News July 1, 2024

అనంత: మేనమామ భార్యతో బాలుడి సంబంధం..హత్య

image

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో వ్యక్తి హత్యకు గురైంది తెలిసిందే. సీఐ హరినాథ్ కథనం..వన్నూరుస్వామి అక్క కొడుకైన 17ఏళ్ల బాలుడు చిన్నప్పటి నుంచి కురాకులతోటలోని మామ ఇంట్లో ఉండేవాడు. మృతుడి భార్యతో సన్నిహితంగా ఉండేవాడు. మామను అడ్డు తొలగించుకోవాలనకున్నాడు. ప్లాన్ ప్రకారం ఈనెల 28న ఇద్దరూ మద్యం తాగుతున్న సమయంలో కత్తితో గొంతు కోసి పరారయ్యాడు.బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు.

News July 1, 2024

గుమ్మఘట్ట: బీటీ ప్రాజెక్టులో చేపల వేట నిషేధం

image

గుమ్మఘట్ట మండలంలోని భైరవాని తిప్ప ప్రాజెక్టులో జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు చేపల వేటను నిషేధిస్తున్నట్లు గుమ్మఘట్ట ఎఫ్ డీ ఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సమయంలో చేపలు తమ సంతానోత్పత్తి ప్రక్రియ కొనసాగిస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులు ఈ విషయాన్ని గమనించి వేటకు దూరంగా ఉండాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వేట సాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.