News December 20, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు: సూర్యాపేట కలెక్టర్

image

రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడుతామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు-2026 నిర్వహణపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రమాదాల నివారణకు రవాణా, విద్యా, పోలీస్ శాఖల సమన్వయంతో పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 24, 2025

రాష్ట్రంలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు

image

AP: రాష్ట్రంలో కొత్తగా 4 చోట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. కాకినాడ, నెల్లూరు, కడప, కర్నూలు మున్సిపాలిటీల్లో ఏర్పాటుకు ఆయా కార్పొరేషన్లు డిస్కంలతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకున్నాయి. తన సమక్షంలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ ప్రాజెక్టులను PPP విధానంలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో ఈ ప్లాంట్లు ఉన్నాయి.

News December 24, 2025

నూతన పెన్షన్లపై అనంతపురం కలెక్టర్ కీలక ప్రకటన

image

ఎన్టీఆర్ భరోసా పథకం కింద నూతన పెన్షన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రావాల్సి ఉందని జిల్లా కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కేవలం స్పౌజ్ కేటగిరీ కింద భర్త మరణించిన వితంతువులకు మాత్రమే పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర కేటగిరీల దరఖాస్తుదారులు మార్గదర్శకాలు వచ్చే వరకు వేచి ఉండాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు.

News December 24, 2025

నర్సాపూర్: ప్రేమ విఫలం.. యువకుడి ఆత్మహత్య

image

ప్రేమ విఫలం కావడంతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన వేణు (24) డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఇంటి నుంచి వెళ్లి గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.