News February 21, 2025
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: కలెక్టర్

విజయవాడను ట్రాఫిక్ పరంగా క్రమశిక్షణతో కూడిన నగరంగా తీర్చిదిద్దడంలో అధికారులు కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్ బాబు అన్నారు. గురువారం విజయవాడ కలెక్టరేట్లో జరిగిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. స్వచ్ఛంధ సంస్థల అధ్యయన నివేదికలను క్షుణ్నంగా అధ్యయనం చేసి ప్రమాదాలు జరగకుండా పటిష్ఠ కార్యాచరణ అవసరమన్నారు.
Similar News
News September 18, 2025
MDCL: మహిళలు, పిల్లల కోసం రక్త పరీక్షలు..!

HYD, MDCL, RR పరిధిలో స్వస్త్ నారీ శక్తి అభియాన్ ప్రోగ్రాం ప్రారంభమైంది. ఈ ప్రోగ్రాంలో మహిళలకు, పిల్లలకు ENT, నేత్ర పరీక్షలు, రక్తపోటు, షుగర్, దంత పరీక్షలు చేస్తున్నారు. నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు, గర్భిణులకు పరీక్షలు, రక్తహీనత పరీక్షలు చేయనున్నారు. టెలీ మానస్ సేవలు, TB పరీక్షలు, సికిల్ సెల్ ఎనిమియా పరీక్షలు అక్టోబర్ 2 వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్నారు.
News September 18, 2025
ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలి: కలెక్టర్

కెజిబివి, ఇంటర్మీడియట్ కళాశాలలో ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయా పాఠశాలలు, ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. బుధవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కేజీబివిలు, ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాలు, అప్లిఏషన్, ఫలితాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. గడిచిన 3 సంవత్సరాలలో ప్రవేశాలు తక్కువగా ఉన్నాయని అన్నారు.
News September 18, 2025
ఆరోగ్యమే మహాభాగ్యం: ఆదిలాబాద్ ఎంపీ

ఆదిలాబాద్‌లో నిర్వహించిన స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరంలో ఎంపీ గోడం నగేశ్ పాల్గొన్నారు. బుధవారం హమాలీవాడ అర్బన్ హెల్త్ సెంటర్‌లో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశ్రీ షాతో కలిసి పేదలకు పథకం ద్వారా అందించే ఫుడ్ కిట్స్‌ను ఎంపీ పంపిణీ చేశారు. శిక్షణ కలెక్టర్ సలోని, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు ఉన్నారు.