News March 22, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు రూ.6లక్షల పరిహారం: విశాఖ సీపీ

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా బాధితులకు శుక్రవారం రూ.6లక్షల పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్ రన్ ప్రమాదంలో చనిపోయిన మల్లిపాటి సూర్యనారాయణ, పైల సూరిబాబు, కొట్యాడ సూర్యప్రభ కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున రూ.6లక్షలు అకౌంట్‌లలో డిపాజిట్ చేసినట్లు సీపీ తెలిపారు. ఇప్పటి వరకూ 24 మంది బాధితులకు రూ.15 లక్షలు అందించామన్నారు.
Similar News
News March 22, 2025
విశాఖలో దొంగలు దొరికారు..!

కేబుల్ వైర్ల దొంగలు విశాఖ పోలీసులకు చిక్కారు. విశాఖ R&Bఆఫీసు సమీపంలోని ఏకలవ్య కాలనీకి చెందిన పిట్టోడు, ఏలూరుకు చెందిన శ్రీను గతంలో కేబుల్ వైర్ పనులు చేశారు. ఎంతో విలువైన ఆవైర్లను కొట్టేయడానికి ప్లాన్ వేశారు. BSNLల్యాండ్ లైన్ ఫోన్లు పనిచేయకపోయినా ఎవరూ పట్టించుకోరనుకున్నారు. MVP డబుల్ రోడ్డులో రాత్రి వేళ గుంతలు తవ్వి టెలిఫోన్ వైర్లను దొంగలించారు. పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.
News March 22, 2025
విశాఖ రైతు బజార్లలో నేటి కాయగూరల ధరలు

విశాఖలోని 13 రైతు బజార్లలో శనివారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. (KG/రూలలో) టమాటా రూ.15, ఉల్లి రూ.23/28, బంగాళదుంపలు రూ.16, దొండకాయలు రూ.38, మిర్చి రూ.28, బెండ రూ.38, బీరకాయలు రూ.44, క్యారెట్ రూ.22/34, బీట్రూట్ రూ.18, బీన్స్ రూ.48, గ్రీన్ పీస్ రూ.50, వంకాయలు రూ.30, కీర రూ.22, గోరు చిక్కుడు రూ.34, బరబాటి రూ.24, కాలీఫ్లవర్ రూ.20, అనప రూ.24గా నిర్ణయించారు.
News March 22, 2025
ఐపీఎల్ బెట్టింగుల పై పోలీసుల నిఘా

నేటి నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లపై పోలీసులు నిఘా పెంచారు. టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌లతో బెట్టింగ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని సీపీ శంఖబ్రత భాగ్చీ ఆదేశాలు జారి చేశారు. బెట్టింగ్ యాప్ ద్వారా గానీ మరే ఇతర విధంగా గాని బెట్టింగ్‌లకు పాల్పడి ప్రాణాలు పోగొట్టుకోవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.