News April 11, 2025
రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి: CP

సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధను సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి క్రిస్టోఫర్ పురుషోత్తమ్ మర్యాద పూర్వకంగా కలిశారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Similar News
News July 4, 2025
పాడేరులో మన్యం వీరుడి జయంతి ఉత్సవాలు

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి శుక్రవారం పాడేరు కలెక్టరేట్‌లో ఘనంగా జరగింది. కలెక్టర్ దినేశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్ర ప్రదర్శన ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శర్మన్ పటేల్, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News July 4, 2025
ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి

ఆమదాలవలస ( శ్రీకాకుళం రోడ్డు) రైల్వే స్టేషన్ కు సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ మధుసూదన రావు తెలిపారు. మృతుని వయసు 45 ఏళ్లు ఉండి, ఎర్రని బనియన్, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 9493474582 నంబరును సంప్రదించాలన్నారు.
News July 4, 2025
త్యాగమూర్తి అడుగు జాడల్లో నడవాలి: ASP

దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరుడు అల్లూరి సీతారామరాజు అడుగు జాడల్లో అందరూ నడవాలని అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ వేంకటాద్రి కోరారు. అల్లూరి చిత్రపటానికి శుక్రవారం పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు స్పూర్తితో ముందుకు వెళ్తామని అన్నారు. దేశ స్వతంత్ర్య వికాసానికి పోరాడుతూ.. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురునిలిచిన దేశ భక్తుడు అల్లూరి అని కొనియాడారు.