News January 24, 2026

రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి: NLG ఎస్పీ

image

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం నల్గొండ ఆర్టీసీ డిపోలో ఆర్ఎం కె.జాన్ రెడ్డి ఆధ్వర్యంలో రీజియన్ స్థాయిలో ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై మాట్లాడుతూ.. ప్రయాణంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నిబంధనలను వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 17, 2026

GWL: ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి

image

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా సవరణకు తప్పిదాలు లేకుండా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. వీసీలో గద్వాల కలెక్టర్ సంతోష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News February 17, 2026

సంగారెడ్డి: ‘ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి’

image

సంగారెడ్డి జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ మాధురి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఎలాంటి తప్పులు లేకుండా మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు. సూపర్వైజర్లు, బీఎల్వోలు అంకితభావంతో పనిచేసి పారదర్శకమైన జాబితాను రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై డీఎం అంబదాస్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

News February 17, 2026

సూపర్-8లో భారత్ ప్రత్యర్థులు వీరే..

image

T20WC-2026లో సూపర్-8 జట్లు దాదాపుగా ఖరారయ్యాయి. రేపు నమీబియాపై గెలిస్తే <<19168498>>పాక్ సూపర్-8కు<<>> వెళ్తుంది.
సూపర్-8 గ్రూప్-1లో వెస్టిండీస్, భారత్, జింబాబ్వే, సౌతాఫ్రికా ఉన్నాయి. గ్రూప్-2లో ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్థాన్/USA, న్యూజిలాండ్ ఉంటాయి. భారత్ ఫిబ్రవరి 22న సౌతాఫ్రికా (అహ్మదాబాద్‌లో), 26న జింబాబ్వే (చెన్నైలో), మార్చి 1న వెస్టిండీస్‌ (కోల్‌కతాలో)తో తలపడనుంది.