News January 4, 2025

రోడ్డు భద్రత ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలి: WGL కలెక్టర్

image

జిల్లాలో ప్రజలకు రహాదారి భద్రతపై అవగాహన కల్పించి ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు జిల్లా కలెక్టర్ డా.సత్య శారదా అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల అవగాహనపై జిల్లా కలెక్టర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు తెలిపారు.

Similar News

News December 30, 2025

వరంగల్: ఇక మునిసిపల్ పోరుపై రాజకీయం..!

image

రెండు నెలలు గ్రామ పంచాయతీ ఎన్నికల చుట్టు తిరిగిన రాజకీయాలు.. ఇప్పుడు పట్టణ పోరుపై తిరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. దీంతో ఆయా పట్టణాల్లో కౌన్సిల్ స్థానాల ఆశావహులు, నాయకుల మధ్య అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే నర్సంపేటలో బీఆర్ఎస్ నాయకులు వార్డుల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.

News December 30, 2025

వరంగల్: ఉదయం 6 నుంచే యూరియ విక్రయం!

image

వరంగల్ జిల్లాలో రైతుల పంటలకు ఉపయోగించే యూరియ కౌంటర్లు ఉ.6 గం.కు తెరిచి విక్రయించవచ్చని కలెక్టర్ సత్య శారద అధికారులను అదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అవసరం అయితే మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, జిల్లాలో యూరియా డీలర్స్ దగ్గర 434 టన్నుల యూరియా స్టాక్ ఉందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 14375 టన్నులు పంపిణీ చేశామని అన్నారు.

News December 30, 2025

యూరియా సరఫరాపై కలెక్టర్ సత్య శారద సమీక్ష

image

యూరియా సరఫరాపై వరంగల్ కలెక్టర్ సత్య శారద సమీక్ష నిర్వహించారు. జిల్లాలో యాసంగి 2025-26లో 1,12,345 ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయన్నారు. ఈ యాసంగిలో ఇప్పటి వరకు 14,375 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందజేశారు. రైతులకు ఎలాంటి కొరత లేకుండా యూరియా సరఫరా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.