News January 4, 2026
రోడ్డు భద్రత మాసోత్సవాలు.. జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు

రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్ర ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌లలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, ప్రధాన కూడళ్లలో ప్రజలకు రోడ్డు భద్రత, గోల్డెన్ అవర్ ప్రాధాన్యతపై సూచనలు ఇస్తూ ప్రమాదం జరిగితే వెంటనే 100కు ఫోన్ చేయాలని తెలిపారు.
Similar News
News February 21, 2026
త్వరలో అందుబాటులోకి తిరుపతి ఐఐటీ రోడ్డు

ఏర్పేడు వద్ద హైవే నుంచి వెంకటగిరి వెళ్లే మార్గంలో తిరుపతి ఐఐటీ మీదుగా నూతన రోడ్డు నిర్మించారు. రూ.98.6 కోట్లతో రోడ్డు నిర్మాణం పూర్తి చేసినా.. రైల్వే ట్రాక్‌పై గిడ్డర్లతో పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై Way2Newsలో వార్త రావడంతో కలెక్టర్ పరిశీలించారు. ఆయన ఆదేశాలతో గిడ్డర్ ఏర్పాటు పనులు పూర్తి కావచ్చాయి. త్వరలోనే ఈ రోడ్డు ప్రజలకు అందుబాటులోకి రానుంది.
News February 21, 2026
యాదాద్రి: నేతన్నలకు అవార్డులు.. దరఖాస్తుల ఆహ్వానం..!

కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులకు చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ ఎ.శ్రీనివాస్ రావు తెలిపారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పురస్కారాలు అందజేస్తారు. 10 ఏళ్ల అనుభవం ఉన్న నేతలు, 5ఏళ్ల అనుభవం ఉన్న డిజైనర్లు అర్హులు. విజేతలకు రూ.25 వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేస్తారు. దరఖాస్తులు కలెక్టరేట్‌లో సమర్పించాలి.
News February 21, 2026
BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,910 పెరిగి రూ.1,59,280కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,750 ఎగబాకి రూ.1,46,000 పలుకుతోంది. అటు వెండి ధర ఏకంగా రూ.20వేలు పెరిగింది. కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.


