News January 6, 2026

రోస్టర్ డేటింగ్.. ఏంటీ కొత్త ట్రెండ్? యువత ఎందుకు మొగ్గు చూపుతోంది?

image

రోస్టర్ డేటింగ్ అంటే ఒకే టైమ్‌లో చాలా మందితో డేటింగ్ చేయడం. నచ్చిన కొంతమందిని సెలక్ట్ చేసుకుని వారితో టచ్‌లో ఉంటారు. ఎవరికీ పర్టికులర్‌గా కమిట్‌మెంట్ ఇవ్వకుండా అందరితో సరదాగా చాట్ చేస్తూ లేదా మీట్ అవుతూ టైమ్ స్పెండ్ చేయడం అన్నమాట. ముఖ్యంగా ఎవరితో సీరియస్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాలో తేల్చుకోలేనప్పుడు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే వ్యక్తిని వెతుక్కోవడానికి ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.

Similar News

News February 13, 2026

రిలయన్స్‌కు వెనిజులా ఆయిల్.. లైసెన్స్ ఇచ్చిన అమెరికా!

image

వెనిజులా నుంచి డైరెక్ట్ ఆయిల్ కొనేందుకు రిలయన్స్‌కు US లైసెన్స్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆంక్షల భయం లేకుండా ఆ కంపెనీ ఇకపై అక్కడి నుంచి నేరుగా క్రూడాయిల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ఉన్న రిలయన్స్‌కు దీనివల్ల ఖర్చులు తగ్గుతాయి. వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో అరెస్ట్ తర్వాత అక్కడి ఆయిల్ ఇండస్ట్రీని US శాసిస్తోంది. మరోవైపు ఈ పరిణామంతో రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గనున్నాయి.

News February 13, 2026

మున్సిపోల్స్.. 3 కార్పొరేషన్లలో హంగ్?

image

TG: కార్పొరేషన్ల ఫలితాలు ఆసక్తిగా మారాయి. కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. కొత్తగూడెంలోని 60 స్థానాల్లో చెరో 22 చోట్ల కాంగ్రెస్, CPI గెలవగా 8 చోట్ల BRS గెలిచింది. ఇప్పటికే CPIకి సపోర్ట్ చేస్తామని కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో CPIకి మేయర్ పీఠం దక్కే ఛాన్స్ ఉంది. అటు కరీంనగర్, నిజామాబాద్‌లో మేయర్ పీఠం కోసం BRS లేదా స్వతంత్రులపై BJP ఆధారపడటం తప్పేలా లేదు.

News February 13, 2026

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?

image

ఎన్నో ట్విస్టులు, మరెన్నో వివాదాల తర్వాత ఎల్లుండి ఇండియా-పాక్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ వేదిక కొలంబోకు వర్షం ముప్పు పొంచి ఉంది. సాయంత్రం అక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం 50-65% ఉందని Accuweather అంచనా వేసింది. కొలంబోలో కొన్ని రోజులుగా వాన పడుతోందని సమాచారం. ఈనెల 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని శ్రీలంక IMD చెప్పడం గమనార్హం.