News March 4, 2025

రౌండ్లవారీగా MLC అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇవే.!

image

MLC ఎన్నికల్లో 5 రౌండ్లలో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇవే. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రకి మొదటి రౌండ్-17194, రెండవ రౌండ్ -17527, మూడవ రౌండ్-16723, నాలుగో రౌండ్-16236, ఐదో రౌండ్-16,916 ఓట్లు చొప్పున వచ్చాయి. మరోవైపు PDF అభ్యర్థి కేఎస్ లక్ష్మణ్ రావుకు మొదటి రౌండ్-7214, రెండవ రౌండ్-6742, మూడవ రౌండ్-7404, నాలుగో రౌండ్-7828, ఐదో రౌండ్-7535 చొప్పున ఓట్లు రాగా..47872 ఓట్లతో ఆలపాటి గెలిచారు.

Similar News

News July 5, 2025

తల్లిదండ్రులకు పోలీసుల సూచన!

image

పిల్లలు ఇంటి నుంచి తరగతి గదికి చేరే వరకూ సురక్షితంగా వెళ్తున్నారా? లేదా? అనేది చూసుకునే బాధ్యత తల్లిదండ్రులు & బస్సు డ్రైవర్లపై ఉందని పోలీసులు తెలిపారు. ‘స్కూల్ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా? నైపుణ్యం కలిగిన డ్రైవరేనా? పికప్, డ్రాప్ టైమ్‌ను పాటిస్తున్నారా? లేదో గమనించాలి. స్కూల్ యాజమాన్యాలు బస్సుల్లో ఎమర్జెన్సీ నంబర్లను రాసి ఉంచాలి’ అని ట్వీట్ చేశారు.

News July 5, 2025

పెందుర్తిలో వ్యభిచార గృహంపై దాడి

image

పెందుర్తిలో వ్యభిచార గృహంపై పోలీసులు శనివారం దాడులు చేశారు. భార్యాభర్తలమంటూ బీసెట్టి ధనలక్ష్మి, వివేక్ సుజాతనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం రావడంతో సీఐ సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. వారిద్దరితో పాటు ఓ విటుడు, మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇల్లు అద్దెకు ఇచ్చేవారు ఆధార్ కార్డుతో పాటు పూర్తి సమాచారం తెలుసుకోవాలని సీఐ సూచించారు.

News July 5, 2025

గిల్ మరో సెంచరీ

image

ENGతో రెండో టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ అదరగొడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్సులో భారీ డబుల్ సెంచరీ చేసిన ఈ యంగ్ సెన్సేషన్.. సెకండ్ ఇన్నింగ్సులో సెంచరీ పూర్తి చేసుకున్నారు. 129 బంతుల్లో 100* రన్స్ చేశారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 303/4గా ఉంది. 483 పరుగుల ఆధిక్యంలో ఉంది.