News October 15, 2025
రౌడీషీటర్ నవీన్‌రెడ్డి నగర బహిష్కరణ

రాచకొండ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. నల్గొండకు చెందిన రౌడీషీటర్ కొడుదుల నవీన్ రెడ్డిపై రాచకొండ సీపీ సుధీర్ బాబు నగర బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. దాడులు, హత్యాయత్నం, బెదిరింపుల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాడన్న కారణంగా అధికారులు 6 నెలల బహిష్కరణ ప్రతిపాదన తీసుకురాగా సీపీ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన ప్రస్తతం అబ్దుల్లాపూర్‌మెట్ పరిధి మన్నెగూడలో ఉంటున్నాడు.
Similar News
News October 15, 2025
HYD: ఎన్నికల వేళ.. జ్యోతిషులు ఫుల్ బిబీ

ఎన్నికలకు సమయం దగ్గరకు వచ్చేకొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ ఎక్కువైంది. ఇంకా నామినేషన్ వేయకముందే వారిలో ఒకరకమైన ఆందోళన.. అందుకే ఎలాంటి ఇబ్బందులు రాకుండా తమకు ఏ రోజు మంచిదో చూసుకొని నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకే సిటీలో పంచాంగ కర్తలు, జ్యోతిషులు బిబీ.. బిజీగా మారారు. పేరు, పుట్టిన తేదీ, జన్మ నక్షత్రం ప్రకారం జాతకం చూస్తూ ఎప్పుడు నామినేషన్ వేయాలో, ఏమేం పూజలు చేయాలో చెబుతున్నారు.
News October 15, 2025
జూబ్లీహిల్స్‌లో KCR రోడ్ షోకు PLAN

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS అభ్యర్థి మాగంటి సునీత తరఫున ఆ పార్టీ ఈనెల 19న భారీ రోడ్‌షోకు ఏర్పాట్లు చేసింది. ఇందులో BRS చీఫ్ KCR పాల్గొంటారనే టాక్ వినిపిస్తోంది. ప్రతిష్ఠాత్మక పోరులో గెలిపే లక్ష్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే జూబ్లీ బరిలో పావులు కదుపుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా KCR తప్పకుండా జూబ్లీహిల్స్‌లో ఎంట్రీ ఇస్తారని కార్యకర్తలు ఆశాగా చూస్తున్నారు.
News October 15, 2025
జూబ్లీహిల్స్: సాదాసీదాగా సునీత నామినేషన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ వేశారు. షేక్‌పేటలోని తహశీల్దార్ కార్యాలయంలో KTRతో కలిసి ఎలాంటి హడావుడి లేకుండా నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆమె వెంట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.