News October 21, 2025
రౌడీ షీటర్ దాడికి పాల్పడ్డాడని మహిళ SUICIDE

రౌడీ షీటర్ తనపై దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రఘునాథపాలెం(M)లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. జగ్యా తండాకు చెందిన బోడ సుశీల(26) అనే మహిళను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(రౌడీ షీటర్) దాడికి పాల్పడడంతో మనస్థాపానికి చెందిన సుశీల ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం ఉరి వేసుకునే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాలి.
Similar News
News October 21, 2025
HYD: సరోజినీ దేవి ఆస్పత్రికి క్యూకట్టిన బాధితులు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దీపావళి సందర్భంగా టపాసుల మోత మోగించారు. దీంతో బాణసంచా బాధితులతో సరోజినీ దేవి ఆస్పత్రి నిండిపోయింది. నిర్లక్ష్యంగా టపాసులు కాల్చడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సరోజినీ దేవి హాస్పిటల్‌లో సుమారు 70 మంది బాధితులు కాలిన గాయాలతో చేరారు. గాయపడిన వారిలో 20 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.
News October 21, 2025
ASF: ‘ప్రతి ఉద్యోగి వివరాలు నమోదు చేసుకోవాలి’

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ASF జిల్లాలో పనిచేసే ప్రతి ఉద్యోగి పోర్టల్‌లోని హెచ్ఆర్ మాడ్యూల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా ఖజానా శాఖ సహాయ సంచాలకురాలు భానుమతి తెలిపారు. ప్రతి ఉద్యోగి ఆధార్, పాన్, ఫోన్ నంబర్ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకోనట్లయితే డీడీఓలకు అక్టోబర్ నెలకు సంబంధించిన వేతనాల బిల్లులు రావని, ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ఓపెన్ కాదన్నారు.
News October 21, 2025
మెగా జాబ్ మేళాలో పాల్గొనాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఈనెల 25న HZNRలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు NLG జిల్లా నుంచి నిర్దేశిత సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె ఈ నెల 25న హుజూర్నగర్లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పై సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాబ్ మేళా పై MGU, ఎన్జీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.