News January 14, 2026
ర్యాంకింగ్స్‌లో నంబర్-1 ప్లేస్‌లో ఇండియా

ICC లేటెస్ట్ ర్యాంకింగ్స్‌లో IND అదరగొట్టింది. వన్డేల్లో 122 పాయింట్లతో తొలి ప్లేస్‌లో నిలిచింది. T20ల్లో 272 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. వన్డే బ్యాటింగ్‌లో కోహ్లీ, T20ల్లో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో టెస్టుల్లో బుమ్రా, T20ల్లో వరుణ్ చక్రవర్తి ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో టెస్టుల్లో జడేజా మొదటి స్థానంలో ఉన్నారు.
Similar News
News February 11, 2026
మీ ‘ఓటు’ ఎక్కడుందో తెలుసుకోండిలా

TG: మున్సిపోల్ నేపథ్యంలో ఓటర్ స్లిప్‌ను ప్రభుత్వ వెబ్‌సైట్ లేదా Te-Poll మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చని EC తెలిపింది. <
News February 11, 2026
US-బంగ్లా డీల్.. భారత్‌కు దెబ్బ!

అమెరికా, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ఒప్పందం భారత టెక్స్‌టైల్ రంగంపై ప్రభావం చూపించనుంది. US మెటీరియల్స్(కాటన్, మ్యాన్ మేడ్ టెక్స్‌టైల్స్)తో తయారు చేసిన వస్తువులను జీరో టారిఫ్స్‌తో ఎగుమతి చేసేందుకు బంగ్లాకు అవకాశం దక్కనుంది. కానీ మన వస్త్ర ఎగుమతులపై మాత్రం 18% సుంకం పడనుంది. బంగ్లా కాటన్ దిగుమతుల్లో గతంలో 70% ఇండియా నుంచే వెళ్లేది. ఇటీవల కొంత తగ్గగా, తాజా డీల్‌తో US కాటన్‌కే బంగ్లా మొగ్గుచూపనుంది.
News February 11, 2026
‘మౌంటెడ్ స్ప్రేయర్’తో ఎరువుల పిచికారీ సులభం

అందుబాటులోకి వస్తున్న ఆధునిక పరికరాలు సాగులో రైతు శ్రమను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది రైతులు ‘మౌంటెడ్ స్ప్రేయర్’ అనే పరికరాన్ని వాడుతున్నారు. దీన్ని ట్రాక్టరుకు బిగించి ద్రవరూపంలో ఎరువులను పిచికారీ చేస్తున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రోజుకు 20 ఎకరాల వరకు స్ప్రే చేయవచ్చు. దీన్ని వాడటం వల్ల కూలీల కొరతను అధిగమించడంతో పాటు మొక్కలకు కూడా సమపాళ్లలో ఎరువులు, మందులను అందించవచ్చు.


