News August 27, 2025

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: మెదక్ ఎస్పీ హెచ్చరిక

image

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు హెచ్చరించారు. నర్సాపూర్‌లోని బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో యాంటీ-ర్యాగింగ్, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని, విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసే అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి విద్యార్థికి సైబర్ నేరాలపై అవగాహన ఉండాలన్నారు.

Similar News

News August 27, 2025

వినాయక చవితి.. మెదక్ ఎస్స్పీ కీలక సూచనలు

image

గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. వినాయక విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. అలాగే మండపాలను ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద మహిళలు, యువతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవ్ టీజింగ్‌ను అరికట్టాలని సూచించారు.

News August 26, 2025

మెదక్ జిల్లాకు వర్ష సూచన.. కలెక్టర్ అల్టర్

image

జిల్లాలో రాబోయే కొన్ని రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. వర్షాలు పడుతున్న సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వంతెనలు, వాగులు, చెరువులు, నీటి మునిగే ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు హెచ్చరించారు.

News August 25, 2025

మెదక్: ఎరువుల కొరత తీరాలని వినాయకుడికి వినతి

image

తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత తీరాలని కోరుకుంటూ వినాయకుడికి వినతిపత్రం సమర్పించిన వినూత్న ఘటన హవేలి ఘనపూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం వినాయకుడికి వినతి పత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎరువుల కొరత తీర్చడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.