News August 11, 2024
ర్యాగింగ్‌తో భవిష్యత్ అంధకారం: మెదక్ SP

జిల్లాలో ర్యాగింగ్ నిరోధించడానికి పోలీస్ అధికారులతో విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తామని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘ఇది అత్యంత అమానుష చర్య. ర్యాగింగ్ నియంత్రణలో స్కూల్, కాలేజీల యాజమాన్యం భాగస్వాములు కావాలి. యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు, ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలి. ర్యాగింగ్‌కు పాల్పడే వారి వివరాలు డయల్ 100, కంట్రోల్ రూం 8712657888కి సమాచారం అందించాలి’ అన్నారు.
Similar News
News November 10, 2025
మెదక్: ‘ఆరు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు’

సంచార పశువైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు 2017 సంవత్సరంలో పశు సంచార వైద్యశాలను అందించారు. ఇందులో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్, హెల్పర్లకు గత ఆరు నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం వచ్చిన వెంటనే పశువులకు సేవలందిస్తున్న తమకు వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 10, 2025
ఏడుపాయల అమ్మవారి సన్నిధిలో దీపోత్సవం

ఏడుపాయల వన దుర్గ మాత సన్నిధిలో కార్తీక సోమవారం పురస్కరించుకొని సాయంకాల ప్రదోషకాల వేళలో దీపాలంకరణ సేవ నిర్వహించారు. అర్చకులు పార్థీవ శర్మ ఆధ్వర్యంలో పూజల అనంతరం మంటపంలో అమ్మవారి ఆకారంలో దీపాలు వెలిగించారు. అనంతరం మంజీరాలో గంగాహారతి ఇచ్చారు. ఆకాశ దీపం వెలిగించారు. భక్తులు పాల్గొని అమ్మవారి నామస్మరణ మారుమ్రోగించారు.
News November 10, 2025
మెదక్: ప్రజావాణి కార్యక్రమంలో 75 దరఖాస్తులు

మెదక్ కలెక్టరెట్‌లోని ప్రజావాణిలో మొత్తం 75 దరఖాస్తులు స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. వీటిల్లో భూ సమస్యలకు సంబంధించి 34, పింఛన్లకు సంబంధించి 14, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 05, దరఖాస్తులు వచ్చాయన్నారు. మిగిలిన 26 దరఖాస్తులు ఇతర సమస్యలకు సంబంధించినవని పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.


