News August 13, 2024
ర్యాగింగ్ చేయడం నేరం: జగిత్యాల ఎస్పీ
ర్యాగింగ్ చేయడం నేరమని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ర్యాగింగ్, సైబర్ మోసాల నివారణపై యువతకు, విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని పొలాస అగ్రికల్చర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, అగ్రికల్చర్ కళాశాల డీన్ భారత్ బట్, రూరల్ సీఐ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Similar News
News November 27, 2024
ఇబ్రహీంపట్నం: ఉరివేసుకుని యువతి ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బ గ్రామానికి చెందిన పుప్పాల రమ్య (19) అనే యువతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై అనిల్ మంగళవారం తెలిపారు. గత 2 నెలలుగా ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తుoడగా ఇష్టం లేదని చెప్పిందనీ, పెండ్లి సంబంధాల విషయంలో తల్లిదండ్రుల నిర్ణయాన్ని నిరాకరించలేక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
News November 27, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.2,79,036 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,81,370 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.70,245, అన్నదానం రూ.27,421,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
News November 27, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. @ ఇబ్రహీంపట్నం మండలంలో ఉరివేసుకొని యువతి ఆత్మహత్య. @ మెట్పల్లి మండలంలో గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ పెద్దాపూర్ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే. @ జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.