News March 19, 2024
ర్యాలీలు, ధర్నాలకు అనుమతులు తప్పనిసరి: సిద్దిపేట సీపీ

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ర్యాలీలు, ధర్నాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ సూచించారు. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 3 తేదీ వరకు కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధర్నాలు, ర్యాలీలు, బహిరంగసభలకు తప్పనిసరిగా ఆయా పోలీస్ స్టేషన్లలో అనుమతులు తీసుకోవాలని సూచించారు.
Similar News
News September 7, 2025
MDK: పాముకాటుకు రైతు మృతి

ఎల్దుర్తి మండలంలోని శేరిల్ల గ్రామానికి చెందిన ఆగమయ్య (50) అనే రైతు పాముకాటుకు గురై మృతి చెందాడు. వ్యవసాయంతో పాటు పశుపోషణతో కుటుంబాన్ని పోషించుకునే ఆగమయ్య, తన గేదెలను మేతకు తీసుకెళ్లగా కాలికి విషసర్పం కాటువేసింది. నోటి నుంచి నురగలు కక్కుతూ అక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఎల్దుర్తిలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News September 7, 2025
మెదక్: 24 గంటల్లోనే విద్యుత్ పునరుద్ధరణ

భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను 24 గంటల్లోపే పునరుద్ధరించినట్లు టీజీఎస్సీపీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు. మెదక్‌లోని ఎస్ఈ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 26 నుంచి 30 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా 115 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన చెప్పారు.
News September 6, 2025
మెదక్: 24 గంటల్లో 110 గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరణ: సీఈ

జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 26 నుంచి 30వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను 24 గంటల్లోపే 110 గ్రామాలకు పునరుద్ధరించినట్లు చీఫ్ ఇంజినీర్ బాలస్వామి తెలిపారు. జిల్లా పరిధిలోని మొత్తం 115 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా, అధికారులు వెంటనే స్పందించి ఎస్‌ఈ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు తమ బాధ్యతలను నిర్వర్తించారని ఆయన పేర్కొన్నారు.