News December 28, 2025
లంకతో మ్యాచ్.. టాస్ ఓడిన భారత్

భారత మహిళల జట్టుతో జరిగే 4వ టీ20లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
INDW: షెఫాలీ, స్మృతి మంధాన, హర్లీన్, హర్మన్‌ప్రీత్(C), రిచా ఘోష్, దీప్తిశర్మ, అమన్‌జోత్, అరుంధతి రెడ్డి, వైష్ణవి, రేణుకా సింగ్, శ్రీచరణి.
SLW: హాసిని పెరెరా, చమరి ఆటపట్టు(C), హర్షిత, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, నీలక్షికా సిల్వా, కౌషని, మల్షా, రష్మిక సెవ్వండి, కావ్య, నిమేషా.
Similar News
News January 2, 2026
ఆరోగ్యాన్నిచ్చే వామకుక్షి.. చేసే విధానమిదే!

వామకుక్షి అంటే భోజనం చేసిన తర్వాత ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం. ముందుగా వెల్లకిలా పడుకుని, ఆపై నెమ్మదిగా ఎడమ వైపునకు ఒరగాలి. కుడి కాలును ఎడమ కాలుపై ఉంచాలి. మీ ఎడమ చేతిని తల కింద దిండులా అమర్చుకోవాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. మరీ గాఢ నిద్రలోకి వెళ్లకుండా, 15 నుంచి 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడమే వామకుక్షి. ఇది ప్రాచీన ఆయుర్వేదం సూచించిన అత్యుత్తమ జీవనశైలి పద్ధతి. SHARE IT
News January 2, 2026
సిగరెట్ ధరలు పెరిగితే స్మగ్లింగ్ పెరుగుతుంది: TII

సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం <<18730084>>పెంపు<<>> వల్ల స్మగ్లింగ్ మరింత పెరుగుతుందని టొబాకో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ప్రస్తుతం ప్రతి 3 సిగరెట్లలో ఒకటి అక్రమంగా రవాణా అయిందేనని చెప్పింది. ‘ఎక్సైజ్ డ్యూటీ పెంపుపై కేంద్రం రివ్యూ చేయాలి. లేదంటే రైతులు, MSMEలు, రిటైలర్లకు నష్టం కలుగుతుంది. అక్రమ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇచ్చినట్లే. డ్యూటీ పెంపును ఒకేసారి అమలు చేయొద్దు’ అని కోరింది.
News January 2, 2026
2025లో శ్రీవారి ఆదాయం రూ.1,383 కోట్లు

AP: 2025లో తిరుమల శ్రీవారికి భారీగా ఆదాయం వచ్చింది. హుండీ ద్వారా రూ.1,383.90 కోట్లు లభించగా, ఇది 2024తో పోలిస్తే రూ.18 కోట్లు అధికం. 2.61 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. లడ్డూ విక్రయాల్లోనూ రికార్డు నమోదైంది. మొత్తం 13.52 కోట్ల లడ్డూలు అమ్ముడవగా, గత ఏడాదితో పోలిస్తే 1.37 కోట్లు ఎక్కువ. డిసెంబరు 27న గత పదేళ్లలో అత్యధికంగా 5.13 లక్షల లడ్డూల విక్రయం జరిగింది.


