News April 21, 2025
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చిల్పూర్ RI

భూ సర్వే కోసం రూ.26 వేలు లంచం తీసుకుంటూ RI ఏసీబీకి పట్టుబడ్డారు. చిల్పూర్ తహశీల్దార్ కార్యాలయంలో RIగా పనిచేస్తున్న వినయ్ కుమార్ ఓ వ్యక్తి వద్ద భూ సర్వే కోసం డబ్బులు డిమాండ్ చేశాడు. సోమవారం బాధితుడు రూ.26 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Similar News
News April 21, 2025
రైతులకు భూ భారతి భరోసా: కలెక్టర్

అడ్డాకల్: పట్టేదారు రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించి వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో చట్టంపై రైతులకు వివరించారు. రెవెన్యూ రికార్డులు ఏమన్నా లోటుపాట్లు ఉంటే భూభారతిలో సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై అవగాహన పెంచుకొని రైతులందరూ వినియోగించుకోవాలన్నారు.
News April 21, 2025
అనకాపల్లి పోలీస్ ప్రజా వేదికలో 45 ఫిర్యాదులు

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు 45 ఫిర్యాదులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ తుహీన్ సిన్హా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి విచారణ నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News April 21, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ నరసరావుపేటలో నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్ డే
☞ వినుకొండలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
☞ వెల్దుర్తి: రోడ్డు ప్రమాదంలో హార్టికల్చర్ ఉద్యోగికి తీవ్ర గాయాలు
☞ చిలకలూరిపేట: బొమ్మల షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం
☞ సత్తెనపల్లిలో వివాహిత అనుమానాస్పద మృతి
☞ రొంపిచర్ల: 6తరగతి ప్రవేశ పరీక్షలకు 221 మంది హాజరు