News March 25, 2025
లంచం తీసుకుంటూ పట్టుపడ్డ పిఠాపురం రూరల్ ఎస్సై

పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దొంతలూరు గ్రామానికి సంబంధించిన కేసు విషయంలో లంచం అడిగినట్లు ఏసీబీకి ముందస్తు సమాచారం అందింది. దీంతో నిఘా ఉంచిన అధికారులు రూ.20వేలు తీసుకుంటుండగా.. అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News July 4, 2025
నల్గొండ: ‘బీఏఎస్ విద్యార్థులపై వివక్ష తగదు’

బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థులపై ఆల్ఫా స్కూల్ యాజమాన్యం వివక్షతకు పాల్పడుతోందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ఆరోపించారు. శుక్రవారం పేరెంట్స్‌తో కలిసి నల్గొండ ఆల్ఫా పబ్లిక్ స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ స్కూల్‌లో దళిత విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారిందని, బుక్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఒంటరిగా కూర్చోబెడుతున్నారన్నారు.
News July 4, 2025
కృష్ణ: గోల్డ్ మెడల్ సాధించిన ఎస్ఐ, కానిస్టేబుల్

కృష్ణ ఎస్ఐగా పనిచేస్తున్న ఎస్ఎం నవీద్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన జోగులాంబ జోన్-7 జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు సమావేశంలో డీఐజీ ఎల్ఎస్ చౌహన్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. స్నైపర్ డాగ్స్ హ్యాండ్లర్ కానిస్టేబుల్ రవి ట్రాకింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. వీరిని ఎస్పీ యోగేశ్ గౌతమ్ అభినందించారు.
News July 4, 2025
KCR లేటెస్ట్ ఫొటోలు

TG: సాధారణ వైద్య పరీక్షల కోసం HYD యశోద ఆస్పత్రిలో చేరిన బీఆర్ఎస్ అధినేత KCRను పలువురు నేతలు పరామర్శించారు. <<16940361>>ఎలాంటి ఇబ్బంది లేకుండా<<>> కుర్చీలో కూర్చున్న మాజీ సీఎం.. కాసేపు నేతలతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, ప్రజా సమస్యలపై వారితో చర్చించారు.