News July 3, 2024
లంచం తీసుకున్న అధికారిని సస్పెండ్ చేసిన కలెక్టర్
నివాస ధ్రువీకరణ పత్రం జారీ విషయంలో నాగుపల్లికి చెందిన లక్ష్మీనారాయణ రెడ్డి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుని పట్టుబడిన ఆర్ఐ జబ్బా ఎర్రయ్య సస్పెన్షన్‌కు గురయ్యారు. నివాస ధ్రువీకరణ పత్రం కోసం ఆర్ఐ రూ.10 వేలు లంచం అడగగా బాధితుడు ఫోన్ పే ద్వారా చెల్లించాడు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన అనంతరం వాస్తవమని తేలడంతో RIని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News November 30, 2024
శబరిమలకు వెళ్లి నేలకొండపల్లి వాసి మృతి
ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు ప్రకారం.. నేలకొండపల్లి మండల చెన్నారానికి చెందిన శనగాని వెంకన్న అయ్యప్ప స్వామి మాల ధరించి ఇరుముడి సమర్పించేందుకు శబరిమల వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో రక్తపు వాంతులు, విరోచనాలు అయ్యాయి. గమనించిన తోటి అయ్యప్ప స్వాములు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
News November 30, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు
∆} వివిధ శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు ∆} సత్తుపల్లి మండలంలో మంచినీటి సరఫరా బంద్ ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మంలో ప్రజా విజయోత్సవాల కార్యక్రమం ∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
News November 30, 2024
ఖమ్మం: వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజుల సెలవు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు అధికారులు రెండు రోజుల సెలవులు ప్రకటించారు. శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉండనుంది. అనంతరం సోమవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. కావున ఖమ్మం జిల్లా రైతులు గమనించి తమకు సహకరించాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అధికారులు కోరారు.