News September 2, 2025
లండన్‌లో యాక్సిడెంట్.. HYD వాసులు మృతి

లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో HYDకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను నాదరుల్ చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ (21)గా పోలీసులు గుర్తించారు. గణేశ్ నిమజ్జనం చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.
Similar News
News September 2, 2025
HYD: ఆలుమగల బీజీ లైఫ్.. ప్లే స్కూల్స్‌కు గిరాకీ

హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్లే స్కూల్స్ పెరుగుతున్నాయి. తల్లులు ఉద్యోగాలకు వెళ్లడం, పిల్లల్ని చూసుకోవడం, వేరే చోట పంపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా వీటికి డిమాండ్ పెరిగింది. హైటెక్ సిటీ, మియాపూర్, అమీర్‌పేట్, KPHB లాంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. పని చేసే తల్లిదండ్రులకు ఇవి చాలా సౌకర్యంగా ఉన్నాయి.
News September 2, 2025
HYD: YSRకు మంత్రి సీతక్క నివాళులు

మాజీ సీఎం దివంగత డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రజాభవన్‌లో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రజల కోసం వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పేదలకు పెద్దన్నగా నిలిచారని అన్నారు.
News September 2, 2025
HYD: KCR, హరీశ్‌రావుకు స్వల్ప ఊరట

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. KCR, హరీశ్‌రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిపింది. ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపట్టొద్దని అదేశించింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామని స్పష్టిం చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది.