News February 18, 2026
లక్కిరెడ్డిపల్లి గంగమ్మకు పట్టు వస్త్రాల సమర్పణ

లక్కిరెడ్డిపల్లి మండలం గంగమ్మ తల్లి ఆలయంలో జాతర ఘనంగా ప్రారంభమైంది. మండిపల్లి లక్ష్మి ప్రసాద్ రెడ్డి అమ్మవారికి ప్రభుత్వం తరఫున మేళతాళాలతో ఊరేగింపుగా పట్టు వస్త్రాలను ఆలయానికి తీసుకెళ్లి సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు మండిపల్లి తెలిపారు.
Similar News
News February 20, 2026
రంజాన్ మాసంలో చార్మినార్‌కు కొత్త అందాలు

రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీలో షాపింగ్ స్టాల్స్ సందడిగా మారాయి. హోల్ సేల్ వస్త్రాల మార్కెట్‌గా పేరుగాంచిన మదీనాతో పాటు చార్మినార్ పరిసర ప్రాంతాలల్లో దుస్తులు, ఇతర అలంకరణ వస్తువుల కొనుగోళ్లతో షాపులకు రద్దీ పెరిగింది. చార్మినార్‌ను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు.
News February 20, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 20, 2026
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లే లక్ష్యం: మంత్రి

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. ఇందులో భాగంగానే Ex IAS రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించినట్లు చెప్పారు. కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. CM CBN బీసీల పక్షపాతి అని తెలిపారు. గత ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో BC రిజర్వేషన్లను 24%కే పరిమితం చేసిందని విమర్శించారు.


