News March 10, 2025

లక్షెట్టిపేట: కూల్ డ్రింక్ మూత మింగి చిన్నారి మృతి

image

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లక్షెట్టిపేట మండలంలోని ఊట్కూర్‌కు చెందిన సురేందర్ కుమారుడు రుద్ర అయాన్ (9నెలలు) కూల్ డ్రింక్ మూత మింగి మృతిచెందినట్లు SI సతీశ్ తెలిపారు. సురేందర్ కుటుంబసమేతంగా ఆదివారం కొమ్ముగూడెంలోని ఓ శుభ కార్యానికి హాజరయ్యారు. అక్కడ రుద్ర అయాన్ ప్రమాదవశాత్తు ఓ కూల్ డ్రింక్ మూత మింగాడు. గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు.

Similar News

News September 17, 2025

IFSCAలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

image

ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(<>IFSCA<<>>) 20 ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 25వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫేజ్1, ఫేజ్ 2 రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫేజ్1 పరీక్ష అక్టోబర్ 11న, ఫేజ్ 2 పరీక్ష నవంబర్ 15న నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://ifsca.gov.in/Career

News September 17, 2025

అనకాపల్లి: ‘8ఏళ్ల తర్వాత దొరికిన నిందితుడు’

image

కొత్తకోట, రావికమతం పోలీస్ స్టేషన్లలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన 4కేసుల్లో నిందితుడు 8ఏళ్ల తర్వాత చిక్కాడని సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు బుధవారం తెలిపారు. కాకినాడకు చెందిన కొరపాకల కుమారస్వామి (33)పై 2017లో కేసు నమోదు కాగా ఆనాటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. హైదరాబాద్‌లోని భవాని‌నగర్‌ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న అతనిని తమ సిబ్బంది అరెస్టు చేయగా రిమాండ్‌కు తరలించామన్నారు.

News September 17, 2025

17 నుంచి పోషణ మాసొత్సవాలు: సీతక్క

image

జీవనశైలి మార్పుల సవాళ్లు ఎదుర్కొనేందుకు పోషకాహారం ముఖ్యమని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలో కేంద్ర సమాచార శాఖ ఫొటో ఎగ్జిబిషన్, పోషణ మాసోత్సవాలను ఆమె ప్రారంభించారు. సీతక్క మాట్లాడుతూ.. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు జిల్లాలో పోషణ మాసోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీసుకోవాల్సిన ఆహారం, పోషణ పర్యవేక్షణపై సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.