News March 5, 2025
లక్షెట్టిపేట: గోదావరిలో మునిగి వ్యక్తి మృతి

లక్షెట్టిపేట పట్టణం ముల్కల్లగూడెంనకు చెందిన ముల్కల్ల సత్యనారాయణ(44) ఈత రాక ప్రమాదవశాత్తు గోదావరి నీటిలో మునిగి మృతి చెందాడని ఎస్సై సతీష్ తెలిపారు. మంగళవారం ఉదయం సత్యనారాయణ గోదావరిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి చనిపోయాడన్నారు. భార్య సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా సత్యనారాయణ కాగజనగర్ ఎస్సీ వసతి గృహంలో వాచ్మెన్‌గా పనిచేస్తున్నాడని SI తెలిపారు.
Similar News
News November 13, 2025
రేపే ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. దాంతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిజల్ట్ రాబోతోంది. మీరెంతో అభిమానించే Way2News ఉ.8 గంటల నుంచే కౌంటింగ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతుంది. వేగంతో పాటు స్పెషల్ గ్రాఫిక్ ప్లేట్లతో ఫలితాల వివరాలను వెల్లడిస్తుంది.
News November 13, 2025
లబ్ధిదారుల ఎంపికపై అవగాహన చేపట్టాలి: ASF కలెక్టర్

ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద ఎల్పీజీ గ్యాస్ లబ్ధిదారుల ఎంపికపై విస్తృత అవగాహన చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. గురువారం ASF జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి ప్రధానమంత్రి ఉజ్వల పథకంపై పౌరసరఫరాల శాఖ అధికారులు, తహశీల్దార్లు, వ్యవసాయ, మత్స్య శాఖల అధికారులు, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
News November 13, 2025
భీమ్‌గల్: రూ.4 కోట్లతో టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణం

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో భీమ్‌గల్ మండలం లింబాద్రి గుట్టలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అభివృద్ధి దిశగా మరో అడుగు పడింది. ఆలయ ప్రాంగణంలో రూ.4 కోట్ల వ్యయంతో టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.


