News February 23, 2025

లక్షెట్టిపేట: దరఖాస్తుల స్వీకరణ

image

లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ మహాత్మా సంతోష్ తెలిపారు. ఎస్ టిఏ 4 సంవత్సరాల టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా నేషనల్ కామన్ ఎంట్రస్స్ టెస్ట్ 2025-2026ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 28వ తేదీలోపు వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 1, 2026

KNR: ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

HYD బోయినపల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 2026-27 విద్యా సంవత్సరానికి 5 తరగతిలో ప్రవేశాలకు గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి దివాకర్ రావు తెలిపారు. దీంతో పాటు పలు తరగతులలో ఖాళీగా ఉన్న 21 సీట్లను సైతం భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 12 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 1, 2026

వేట్లపాలెం ప్రమాదంపై డిప్యూటీ సీఎం, హోంమంత్రి సమీక్ష

image

వేట్లపాలెం బాణసంచా పేలుడుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు మురళీ మోహన్, నిరంజన్ రెడ్డి వారిని కలిసి వివరాలను వివరించారు. ప్రమాదానికి గల కారణాలు, భద్రతా లోపాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ నేత మాధవ్ కూడా పాల్గొన్న ఈ భేటీలో బాధితులకు అండగా ఉండాలని నిర్ణయించారు.

News March 1, 2026

మహారాష్ట్రలో భారీ ప్రమాదం.. 15 మంది మృతి

image

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ కటోల్ ప్రాంతంలో పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలో భారీ ప్రమాదం సంభవించింది. SBL ఎనర్జీ లిమిటెడ్‌లో జరిగిన ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా 10 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.